Ola Electric IPO: ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ప్రారంభం.. గ్రే మార్కెట్ ప్రీమియం ఎంతంటే..!
ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ ఆగస్ట్ 2న సబ్‌స్క్రిప్షన్ కోసం అయింది. ఓలా ఐపీఓకు 1వ రోజు మంచి స్పందన వచ్చింది. రిటైల్ పోర్షన్ 1.33 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను పొందగా, ఉద్యోగుల కోసం రిజర్వ్ చేసిన భాగం 4.37 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌ను అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBలు) కోసం రిజర్వ్ చేయబడిన భాగం ఇంకా ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ను పొందలేదు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తమ మొత్తం రిజర్వ్ చేసిన కోటాలో 13% సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
మొత్తంమీద, ఓలా ఎలక్ట్రిక్ IPOలో 29% మధ్యాహ్నం 2:10 గంటలకు సబ్‌స్క్రైబ్ అయింది. రూ. 6,145.56 కోట్లను సమీకరించే లక్ష్యంతో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ తీసుకొస్తున్నారు. ఓలా ఎల్ట్రకిక్ ను 2017లో భావిష్ అగర్వాల్ స్థాపించారు. ఈ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలని విక్రయిస్తోంటోంది. కంపెనీ ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ ప్యాక్‌లు, మోటార్లు, వాహన ఫ్రేమ్‌లతో సహా కీలకమైన భాగాలను తయారు చేయడంపై దృష్టి సారిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ IPO అనేది బుక్-బిల్ట్ ఇష్యూగా ఉంది. ఇందులో రూ. 5,500 కోట్ల విలువైన 72.37 కోట్ల షేర్లు తాజా ఇష్యూ కాగా.. రూ. 645.56 కోట్లు విలువైన 8.49 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు. ఆగస్టు 2, 2024 నుంచి ఆగస్టు 6, 2024 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం IPO ఓపెన్ అయి ఉంటుంది. షేర్ల కేటాయింపు ఆగస్టు 7, 2024న ఖరారు చేస్తారని తెలుస్తోంది. షేర్లు BSE, NSEలలో లిస్టింగ్ కానుంది.
ఓలా ఎలక్ట్రిక్ IPO ధర బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.72 నుంచి రూ.76 మధ్య నిర్ణయించింది. దరఖాస్తుల కోసం కనీస లాట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కో లాట్ లో 195 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్‌లకు కనీసం రూ. 14,820 పెట్టుబడి పెట్టాలి. ఆగస్టు 1, 2024 నాటికి, ఉదయం 11:02 గంటలకు Ola ఎలక్ట్రిక్ IPO కోసం గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 12.20 ప్రీమియంతో ట్రేడవుతోంది.


Click it and Unblock the Notifications