Ola Electric: కస్టమర్లకు రూ.130 కోట్లు రిఫండ్ ఇచ్చిన ఓలా.. ఎందుకంటే..?
Ola Electric: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా తమ కస్టమర్లకు దాదాపు రూ.130 కోట్లను తిరిగి చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈవీ ఛార్జర్ కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ మెుత్తం అందుకోనున్నారు.
2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మార్చి 30, 2023 వరకు ఓలా S1Pro మోడల్ స్కూటర్‌ను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారుల నుంచి వసూలు చేసిన ఆన్ బోర్డ్ ఛార్జర్ సొమ్మును కంపెనీ తిరిగి చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అధిక ధరల విషయంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన విచారణపై ద్విచక్ర వాహన కంపెనీ స్పందిస్తూ తాజా చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.

ప్రభుత్వం విచారణ, సబ్సిడీల సస్పెన్షన్ గురించి సీఈవో భవిష్ అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏం చేయమన్నా కంపెనీ చేస్తుందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో సమస్యలను పరిష్కరించేందుకు ఓలా ఎలక్ట్రిక్ ప్రభుత్వంతో టచ్‌లో ఉందని కంపెనీ వెల్లడించింది.
దీనికి ముందు కేంద్ర ప్రభుత్వం రెండు ఈవీ కంపెనీలకు అందించిన రూ.249 కోట్ల సబ్సిడీలను రికవరీ చేయాలని నిర్ణయించింది. ఇందిలో ఒకినావా ఆటోటెక్ నుంచి రూ.116 కోట్లు, హీరో మోటార్స్ నుంచి రూ.133 కోట్లను తిరిగి వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీలు FAME ఇండియా స్కీమ్ ఫేజ్ II కింద సబ్సిడీలను దుర్వినియోగం చేయడంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందిన తరుణంలో చర్యలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఈ ఫిర్యాదులను దర్యాప్తు పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ టెస్టింగ్ ఏజెన్సీలను నియమించింది.


Click it and Unblock the Notifications