Ola Electric: వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు దేశ ప్రజలు షిఫ్ట్ అవుతున్న వేళ.. దేశీయ ఓలా దూకుడు పెంచింది. వివిధ ఆదాయ వర్గాలను టార్గెట్ చేస్తూ నయా మోడళ్లను లాంచ్ చేస్తోంది.
ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ ఆగస్ట్ 15న కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ S1Xని విడుదల చేసింది. ఈ క్రమంలో కంపెనీ Diamondhead, Adventure, Roadster, Cruiser ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ప్రివ్యూ చేసింది. ఇవి 2024లో యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త S1X రెండు బ్యాటరీ ఎంపికల్లో ప్రారంభించబడింది. వీటి ప్రారంభ ధర రూ.79,999గా నుంచి రూ.99,999 మధ్య మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

2kWh బ్యాటరీతో బేస్ మోడల్, 3 kWh బ్యాటరీ మోడల్, S1 X+ పెద్ద బ్యాటరీ వేరియంట్ల ధరలు వేరువేరుగా ఉన్నాయి. తేలికైన బ్యాటరీ, మెరుగైన థర్మల్ పనితీరు, అదనపు భద్రతతో కూడిన S1X ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. అలాగే గంటకు గరిష్ఠంగా 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఎక్కువ మోడళ్లు ప్రజలకు వారి బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా అనేక ఎంపికలను అందిస్తాయని సీఈవో భవిష్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
ఓలా ఎలక్ట్రిక్ 2023 చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని భావిస్తోంది. అలాగే ఓలా మ్యాప్స్, టెంపర్ అలర్ట్, హిల్ డిసెంట్, ఫైండ్ మై స్కూటర్, జియోఫెన్సింగ్, టైమ్ ఫెన్సింగ్‌తో సహా 100కి పైగా మెరుగుదలలు, 20 కంటే ఎక్కువ కొత్త ఫీచర్‌లతో కంపెనీ MoveOS4 అప్‌డేట్‌ను పరిచయం చేసింది. 2021 జనవరిలో కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి మార్చి 2023 వరకు ఓలా మెుత్తంగా 3 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించింది. టైర్-2,3 నగరాలు ప్రధానంగా ఉత్తరాధి నుంచి డిమాండ్ అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.


Click it and Unblock the Notifications