Ola Electric Mobility IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ మెుబిలిటీ ఐపీవో ప్రారంభమైంది. ప్రస్తుతం ఐపీవోల కోలాహలం దలాల్ స్ట్రీట్‌లో కొనసాగుతున్న వేళ కంపెనీ ఈక్విటీ మార్కెట్లలోకి అడుగుపెట్టే ప్రయత్నాన్ని మెుదలుపెట్టింది.
ఓలా ఎలక్ట్రిక్ మెుబిలిటీ ఐపీవో ఆగస్టు 2 నుంచి ప్రారంభం అవుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వ్యాపారంలో ఉన్న కంపెనీ ప్రస్తుతం తన ఐపీవో ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.72-76గా నిర్ణయించింది. ఆగస్టు 6 వరకు కొనసాగనున్న ఐపీవో లాట్ పరిమాణాన్ని 195 షేర్లుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీవోలో ఓలా ఎలక్ట్రిక్ రూ.5,500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేయనుంది. ఇదే క్రమంలో ఆఫర్ ఫర్ సేల్ కింద 8,49,41,997 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయించనున్నట్లు వెల్లడించింది.

దీంతో కంపెనీ మెుత్తంగా దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూ.6,145.55 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు రూ.645.56 కోట్లకు షేర్లను విక్రయించనున్నట్లు కంపెనీ వివరించింది. ఈ వాటాల విక్రయంలో ప్రమోటర్ భవిష్ అగర్వాల్‌తో పాటు ఇండస్ ట్రస్ట్, ఆల్ఫా వేవ్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇంటర్నెట్ ఫండ్స్ III, మాక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్స్, SFV II ఆస్ట్రిచ్ (DE), అష్నా అడ్వైజర్స్, టెక్నే X ప్రైవేట్ వెంచర్స్ వెంచర్స్ ప్రైవేట్ షేర్ హోల్డర్స్ ఆఫర్ ఫర్ సేల్ ప్రక్రియలో పాల్గొంటున్నారు.
ఓలా ఎలక్ట్రిక్ తాజా ఇష్యూ నుంచి వచ్చే నికర ఆదాయాన్ని దాని అనుబంధ సంస్థ OCT సెల్ తయారీ కర్మాగారం సామర్థ్యాన్ని విస్తరించడానికి వెచ్చించాలని నిర్ణయించింది. కొంత భాగాన్ని ముందస్తు చెల్లింపులకు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించింది. కంపెనీ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధర ప్రకటించకముందే గ్రేమార్కెట్లో కోలాహలం మెుదలైంది. ప్రస్తుతం ఒక్కో షేరుకు గ్రేమార్కెట్ ప్రీమియం రూ.15గా ఉంది.
భారత్ వేగంగా ఈవీలవైపు మళ్లుతున్న వేళ ఆ అవకాశాన్ని ద్విచక్రవాహన రంగంలో ఓలా అందిపుచ్చుకుంటోంది. ఈ క్రమంలో 2021 ఆగస్టు నుంచి దాదాపు 7 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ క్రమంలో Ola S1, Ola S1 Air, Ola S1 X, Ola S1 X+ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని తర్వాత ఆగస్టు 2023లో డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్ స్టర్, క్రూజర్ వంటి ఇతర ఉత్పత్తులను తీసుకురానున్నట్లు ప్రకటించింది. విదేశాలకు సైతం ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ క్రమంలో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.1,584.40 కోట్లుగా ఉండగా.. ఆదాయం రూ.5,243.27 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications