Ola News: గత ఏడాది స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత భవిష్ అగర్వాల్ కలల ప్రాజెక్ట్ ఓలా ఎలక్ట్రిక్ లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తోంది. పెట్టుబడిదారుల నుంచి వస్తున్న హీట్ తగ్గించుకునే క్రమంలో స్టాక్ కొన్ని స్టెప్స్ ప్రారంభించింది.
ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకునేందుకు ఓలా ఎలక్ట్రిక్ మోబిలిటీ 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్లను తొలగించిందని వెల్లడైంది. దేశంలో ప్రముఖ స్కూటర్ తయారీ సంస్థ ఓలా భారీగా పెరిగిన నష్టాలను తగ్గించుకోవటానికి ఈ చర్యలకు ఉపక్రమించింది. సోఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్ పెట్టుబడి మద్దతు పొందిన ఈ సంస్థ ప్రస్తుతం ప్రొక్యూర్మెంట్ నుంచి ఛార్జింగ్ ఇన్ ఫ్రా వరకు అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది.

గడచిన 5 నెలల కాలంలో కంపెనీ రెండోసారి జరుగుతున్న ఉద్యోగుల తొలగింపులు కావటం గమనార్హం. సంస్థ ఈనెల ఆగస్టులో స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన తర్వాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత డిసెంబరు త్రైమాసికంలో సంస్థ నష్టాల్లో 50% పెరుగుదలను నమోదు చేయటం తెలిసిందే. అలాగే ఇటీవల భారతదేశ మార్కెట్ రెగ్యులేటర్ అండ్ వినియోగదారుల రక్షణ సంస్థల నుండి కంపెనీ విమర్శలు ఎదుర్కొంది. గత ఏడాది నవంబరులో సుమారు 500 మంది ఉద్యోగులు తొలగించబడ్డారు.
అలాగే ఓలా తమ కస్టమర్ సంబంధాల కార్యకలాపాలను ఆటోమేటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ తొలగింపు ప్రణాళికలు వ్యాపార అవసరాల ప్రకారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన కార్యకలాపాలను ఆటోమేటెడ్ చేయడం ద్వారా మెరుగైన మార్జిన్లు, తగ్గిన వ్యయాలు మెరుగైన కస్టమర్ అనుభవం అందించాలని చూస్తున్నట్లు ఓలా ప్రతినిధి వెల్లడించారు. మెరుగైన ఉత్పాదకత అందించడానికి ఇది దోహదపడుతుందని తెలుస్తోంది. ఓలా తన షోరూమ్‌లు, సర్వీస్ సెంటర్లలో ఉన్న ఫ్రంట్-ఎండ్ సేల్స్, సర్వీస్ అండ్ వేర్‌హౌస్ సిబ్బందిని కూడా తొలగిస్తోంది. బెంగళూరులోని ఈ సంస్థ తాము సరఫరా, డెలివరీ వ్యూహాలను మార్చుకుంటూ వ్యయం తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో ఓలా ఎలక్ట్రిక్ షేర్లు తమ ఆల్-టైమ్ హై స్థాయిల నుంచి 60% క్షీణించాయి. 2024 ఆగస్టులో ఐపీవో ద్వారా బ్లాక్‌బస్టర్ ప్రదర్శన సాధించినప్పటికీ.. ఈవీ కొనుగోలుదారుల నుంచి వరుస ఫిర్యాదులు, సోషల్ మీడియా విమర్శలతో మార్కెట్ వాటాను కోల్పోయింది. దీనికి తోడు ఇటీవల కాలంలో బజాజ్ తన ఈవీ చేతక్ లాంట్ చేయటంతో ఓలాను వెనక్కి నెట్టింది. డిసెంబరులో బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్‌లో నాయకత్వం సంపాదించడంతో ఓలా ఎలక్ట్రిక్ మూడో స్థాయికి పడిపోయింది.
ఓలా ఎలక్ట్రిక్ గతంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు. ఇప్పుడు బజాజ్, టీవీఎస్ మోటార్ కంపెనీల నుండి పోటీని ఎదుర్కొంటూ తక్కువ మార్కెట్ షేర్‌కి దిగజారింది. 2024 డిసెంబరు నాటికి దేశంలోని ప్రధాన పది ఈవీ మార్కెట్లలో ఓలా తన నాయకత్వాన్ని కోల్పోయినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. జనవరిలో ఓలా 3,200 కొత్త షోరూమ్‌లు ప్రారంభించినా, కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులను నివారించడానికి సంస్థ కృషి చేస్తూనే ఉంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications