Ola Boss Discount: ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయంలో ఓలా తొలిస్థానాన్ని కొనసాగిస్తోంది. దీని తర్వాతి స్థానాన్ని బజాజ్ ఆక్రమించగా, టీవీఎస్ మూడో స్థానంలోకి జారిపోయింది. ఈ క్రమంలో విక్రయాలను మరింతగా పెంచేందుకు దేశంలోని అతిపెద్ద ఈవీ స్కూటర్ మేకర్ ఓలా ఎలక్ట్రిక్ పండుగ సీజన్ కోసం తన బాస్ - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ ప్రారంభించింది.
క్యాంపెయిన్ కింద కంపెనీ తన S1 పోర్ట్‌ఫోలియోలో రూ.49,999 కంటే తక్కువ ధరకు ప్రవేశాన్ని ప్రకటించింది. దీనికి తోడు కంపెనీ గరిష్టంగా రూ.40,000 వరకు పండుగ ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందిస్తోంది. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్స్ వంటి ఆఫర్స్ అందించబడుతున్నాయి. అక్టోబర్ 3, 2024 నుంచి ప్రకటించబడిన బాస్ క్యాంపెన్ కింద వినియోగదారులకు అందించబడుతున్న ప్రయోజనాలను పరిశీలిస్తే..

● బాస్ ధరలు: ఓలా S1 X 2kWh కేవలం ₹49,999తో ప్రారంభమవుతుంది.
● బాస్ తగ్గింపులు: S1 పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా రూ.25,000 - S1 X 2kWhపై రూ.25,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, S1 పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా ₹15,000 వరకు తగ్గింపు ఇన్వబడుతోంది.
● బాస్ వారంటీ: రూ.7,000 విలువైన 8-సంవత్సరాలు/80,000 km బ్యాటరీ వారంటీ ఉచితంగా అందిస్తోంది.
● బాస్ ఫైనాన్స్ ఆఫర్‌లు: ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ EMIలపై రూ.5,000 వరకు ఫైనాన్స్ ఆఫర్ ప్రకటించబడింది.
● బాస్ ప్రయోజనాలు: రూ.6,000 విలువైన MoveOS+ అప్‌గ్రేడ్; గరిష్టంగా రూ.7,000 విలువైన ఉచిత హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు పొందుతారు.
ఈ పండుగ సీజన్‌లో కస్టమర్‌ల కోసం అన్ని ఆఫర్‌ల BOSSని తీసుకురావటంపై ఓలా ఎలక్ట్రిక్ చైర్మన్, MD భవిష్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఉత్తమ సమయంగా పేర్కొన్నారు. BOSS అనేది మా అతిపెద్ద పండుగ ఆఫర్, మేము మా మిషన్‌తో #EndICEAgeని కొనసాగిస్తున్నామని, దేశవ్యాప్తంగా EV వ్యాప్తిని మరింతగా పెంచుతామన్నారు. ఓలా ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా తన సేల్స్ అండ్ సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతో నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ 2025 చివరి నాటికి నెట్‌వర్క్‌ను 10,000కి పెంచాలని యోచిస్తోంది. ఇదే క్రమంలో దేశంలోని ప్రతి మెకానిక్‌ని ఈవీలను రిపేర్ చేసేందుకు వీలుగా లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇస్తుంది.
తన కస్టమర్ల కోసం అమ్మకాల తర్వాత అనుభవాన్ని పునర్నిర్వచించటానికి, Ola Electric ఇటీవల #HyperService ప్రచారాన్ని ప్రకటించింది. దీని కింద కంపెనీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు చేయాలని యోచిస్తోంది. కంపెనీ మెుదటి సారిగా AI ఆధారిత ప్రోయాక్టివ్ మెయింటెనెన్స్ & డయాగ్నోస్టిక్‌లను రూపొందించింది. ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే.. ప్రీమియం ఆఫర్‌లు S1 Pro రూ.1,34,999, S1 ఎయిర్ రూ.1,07,499, మాస్ మార్కెట్ ఆఫర్‌లలో S1 X పోర్ట్‌ఫోలియో 2 kWh ధర రూ.74,999, 3 kWh రూ.87,999, 4 kWh ధర.101,999గా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర మోడళ్లపై కూడా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications