OLA EV: తక్కువ వడ్డీకి ఓలా స్కూటర్.. NO డౌన్ పేమెంట్.. స్పెషల్ ఆఫర్ వివరాలు..
OLA Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీనంతటికీ కారణం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించటంతో పాటు శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యాలు. ఈ క్రమంలో ఓలా #EndICEAge పేరుతో కొత్త క్యాంపెయిన్ ప్రారంభించింది.
ఈ క్రమంలో ఎస్-1 స్కూటర్ లైనప్ తో పాటు అత్యుత్తమ ఫైనాన్స్ సౌకర్యాన్ని ఓలా తన కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎల్ టి ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా మరిన్ని సంస్థలతో భాగస్వామ్యాన్ని కలగి ఉంది. ఈ క్రమంలో జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని వినియోగించుకుని కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లే సదుపాయాన్ని ఓలా ఎలక్ట్రిక్ తీసుకొచ్చింది. పైగా తక్కువ నెలవారీ ఈఎంఐ చెల్లింపు సదుపాయాన్ని కలిగి ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉన్న కంపెనీ వినియోగదారుల కోసం అత్యంత చవకైన వడ్డీ రేట్లకు ఫైనాన్స్ ఎంపికలను అందిస్తున్నట్లు ఓలీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అంకుష్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్రాల స్వీకరణకు అపారమైన మార్కెట్ ఉందని.. తమ తాజా ఫైనాన్స్ ఆప్షన్లు ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్ గా నిలుస్తుందన్నారు.
ఫైనాన్స్ ఆప్షన్లకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా వినియోగదారులు తమకు సమీపంలోని కస్టమర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లకు వెళ్లవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700కు పైగా అనుభవ కేంద్రాలను కలిగి ఉన్న ఓలా వాహనాలను ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ పద్ధతిలో ఫైనాన్స్ ఎంపికలతో అందుబాటులో ఉందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో గడచిన మూడు త్రైమాసికాలుగా కంపెనీ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications