Ola Scooter: ఓలా ఊరించే ఆఫర్.. దీపావళికి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేటు తెలిస్తే వెంటనే కొనేస్తారు..
Ola Scooter: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో చాలా మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా మెుదలైంది. అయితే ద్విచక్ర వాహనాల విభాగంలో అంతరాయం మాత్రం కొనసాగుతోంది. అనేక కంపెనీలు ఒకదాని తర్వాత మరొకటి కొత్త వాహన మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇదే సమయంలో ఓలా కీలక నిర్ణయం తీసుకుంది.

టూ వీలర్ మార్కెట్..
భారతీయ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో రూ.లక్ష కంటే తక్కువ ధరకు విక్రయించే వాహనాల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్లో రూ.లక్షకు పైగా రేటు పలుకుతున్న వాహనాల సంఖ్య ఎక్కువగానే ఉంది. అందుకే ఓలా సరికొత్త ఆలోచనతో ముందుకొస్తోంది. అదేటంటే ఈ దీపావళి నాటికి రూ.80 వేల ధరతో కొత్త వాహనాన్ని విడుదల చేస్తున్నట్లు సమాచారం.
భవిష్ అగర్వాల్..
కొద్ది రోజుల కిందట భవిష్ అగర్వాల్ కంపెనీ అతిపెద్ద ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఒక ట్వీట్ చేశారు. దీనివల్ల IC ఇంజన్ వాహనాల ఆధిపత్యం రెండు సంవత్సరాల్లో ముగుస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం కంపెనీ తీసుకొస్తున్న తక్కువ బడ్జెట్ వాహనాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అలా కంపెనీ తక్కువ ధరలో S1 సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేస్తోంది.

ఫీటర్స్ ఇవేనండి..
ఈ దీపావళికి ఓలా నుంచి అతిపెద్ద ప్రకటన ఉంటుందని భవిష్ అగర్వాల్ ట్వీట్ చేయటం అనేకమందిని ఆకర్షిస్తోంది. అయితే కంపెనీ ప్రస్తుతం లాంచ్ చేయనున్న స్కూటర్లో S1 వేరియంట్ కు దాదాపు దగ్గరగానే ఉంటాయని తెలుస్తోంది. ఇది గనుక అందుబాటులోకి వస్తే చాలా కంపెనీల ఈవీ వాహనాలకు పోటీగా నిలవనుంది.


Click it and Unblock the Notifications