Ola CEO: భారతీయుల వస్త్రధారణపై ఓలా CEO కామెంట్స్.. యువ టెక్కీలకు కీలక సూచనలు
Indian Dressing: ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరుగుతున్న వివిధ విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. కాగా ఈసారి ఆయన వస్త్రధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరం జనరేషన్ కు పలు సూచనలు ఇచ్చారు. తాను కూడా వాటినే అనుసరిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అవి కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
విదేశీ వస్త్రాలంకరణ వదిలేసి భారతీయులు కుర్తా వంటి వాటిని ధరించాలని ఓలా CEO పిలుపునిచ్చారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన భారతీయ వస్త్రాలైన కుర్తాలు చర్మానికి, శరీరానికి సౌకర్యవంతంగా ఉంటాయన్నారు. ఇది ఇండియన్స్ కి ఉన్న ప్రత్యేక ఫ్యాషన్ సెన్స్ అని పేర్కొన్నారు. యువ సాంకేతిక నిపుణులు, టెక్కీలు వీటిని ధరించడం అలవాటు చేసుకోవాలని కోరారు.

టెక్ ఇండస్ట్రీలో నడుస్తున్న ఐకానిక్ ఫ్యాషన్ ట్రెండ్ పై కూడా ఆయన మాట్లాడారు. ఇందుకోసం స్టీవ్ జాబ్స్ టర్టిల్‌నెక్ మరియు జెన్సన్ హువాంగ్ లెదర్ జాకెట్లను ఉదాహరణగా చూపారు. అదేవిధంగా భారతీయులు కూడా మన సంస్కృతీ, సాంప్రదాయాలకు అద్దం పట్టే దుస్తులు ధరిస్తే బావుంటుందన్నారు. కుర్తాలు సౌకర్యవంతంగానే కాకుండా వేసవిలో స్టైలిష్ గా కూడా ఉంటాయని కితాబిచ్చారు.
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ సహా పలు సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ గా మారింది. పలువురు పారిశ్రామికవేత్తలు, సోషల్ మీడియా యూజర్లు భవిష్ సూచనలపై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. భారతీయుతను టెక్ ఇండస్ట్రీకి అనుసంధానించడంలో ఇదొక మొదటి అడుగుగా చెబుతున్నారు. ఎప్పుడూ వ్యాపార ధోరణి కాకుండా దేశం గురించి కూడా ఆలోచిస్తున్న యువ పారిశ్రామికవేత్త ఐడియాలజీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications