70 hours work: మానవ జీవితంలో సంపాదన ఎంత ముఖ్యమో, ఆరోగ్యమూ అంతే అవసరం. అందుకే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంపై టెక్ కంపెనీలు ఎక్కువగా దృష్టి సారిస్తుంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిగంటలు అమలు చేస్తుంటాయి. అయితే ఇటీవల వర్కింగ్ అవర్స్ పెంచితే బావుంటుందని కొందరు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారం చెలరేగింది. కాగా ఇదే విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి యువత వారానికి 70 గంటలపాటు పనిచేయాలని గత అక్టోబర్‌లో పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలతో భారత్ పోటీపడాలంటే ఇలా చేయడం తప్పదని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలపై కార్పొరేట్ మరియు స్టార్టప్ రంగం నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా ఓలా CEO భవిష్ అగర్వాల్ మరలా దీనిపై చర్చను ప్రారంభించారు. మూర్తి ఆలోచనకు తన మద్ధతు తెలిపారు.

'వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అనే భానతో నేను ఏకీభవించను. ఎందుకంటే మీరు చేసే పనిని ఆస్వాదిస్తూ ఉంటే, జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు' అని భవిష్ తన తాజా పోడ్‌కాస్ట్ లో చెప్పుకొచ్చారు. దీంతో పలువురు వైద్యులు రంగంలోకి దిగారు. వారానికి 70 గంటలు పని అనేది కేవలం శ్రమ దోపిడీ మరియు లాభాపేక్షతో మాత్రమే అమలు చేయాలని చూసే విధానమన్నారు.
ఈ విధానాన్ని అమలు చేయాలనుకునే సంస్థలు ఉద్యోగుల ఉపాధి మరియు ఆరోగ్యానికి హామీ ఇవ్వగలవా అని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. వారానికి 40 గంటల పనిని 70కి పెంచితే పక్షవాతం, గుండెపోటు, అధిక రక్తపోటు వంటి హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయంటున్నారు. ఇందుకుగాను తగిన శాస్త్రీయ ఆధారాలు సైతం ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. 55 గంటలు పనిచేసినా స్ట్రోక్ వచ్చే ప్రమాదం 35 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.
హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన చెందిన న్యూరాలజిస్ట్ ఈ తరహా అధ్యయనాల ఫలితాలను తన X ఖాతాలో పోస్ట్ చేశారు. వారానికి 55 గంటలకు పైగా పని చేయడం వల్ల ప్రతి సంవత్సరం 8 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని అందులో పేర్కొన్నారు. అధిక బరువు, ప్రీడయాబెటిస్ వంటి ప్రమాదాల అంచున వారు ఉంటున్నట్లు వివరించారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications