IT News: మైక్రోసాఫ్ట్‌కు భారీ ఎదురుదెబ్బ.. అలా పగతీర్చుకున్న ఓలా చీఫ్
Ola News: పలువురు వ్యాపారులు తమ ప్రత్యర్థులపైనా, ఇబ్బందులు కలగజేసిన వారిపైనా ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఇవి చాలా ఫన్నీగా అనిపిస్తాయి కానీ మరోసారి భారీ స్థాయిలో నష్టాన్ని ఏర్పరుస్తాయి. తన పోస్టులు డిలీట్ చేయడంతో చిర్రెత్తిన ఓ ఇండియన్.. అంతర్జాతీయ దిగ్గజ IT సంస్థకు మైండ్ బ్లాక్ అయ్యే ఝలక్ ఇచ్చాడు.
ప్రముఖ EV మేకర్ ఓలా.. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు గట్టి షాక్ ఇచ్చింది. అజూర్ నుంచి దాని ఫ్లాగ్‌షిప్ 'కృత్రిమ్' క్లౌడ్‌కు మారుతున్నట్లు ఓలా సహ వ్యవస్థాపకులు భవిష్ అగర్వాల్ ప్రకటించారు. ప్రొఫెషనల్ కమ్యూనిటీ పాలసీలకు అనుగుణంగా లేవంటూ భవిష్ పోస్ట్‌లను లింక్డ్ఇన్ తొలగించడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

'లింక్డ్‌ఇన్ మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలో ఉంది. అజూర్ కు ఓలా పెద్ద కస్టమర్. కాబట్టి మేము మా మొత్తం వర్క్ లోడ్‌ను అజూర్ నుంచి మా స్వంత కృత్రిమ్ క్లౌడ్‌కు వచ్చే వారంలోగా తరలించాలని భావిస్తున్నాం' అని భవిష్ అగర్వాల్ తన X పోస్ట్‌లో తెలిపారు. అంతేకాకుండా ఈ విధంగా అజూర్ నుంచి బయటకు వెళ్లాలనుకునే డెవలపర్‌లకు భారీ ఆఫర్ సైతం ప్రకటించారు. అజూర్‌కు తిరిగి వెళ్లనంత కాలం కృత్రిమ్ క్లౌడ్ లో ఏడాదిపాటు ఉచిత క్లౌడ్ వినియోగాన్ని అందజేస్తామని తెలిపారు.
వ్యాపార-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ AI ఉపయోగించే తటస్థ సర్వనామాలపై భవిష్ విమర్శలు గుప్పించారు. భారతీయులు సర్వనామాలు కలిగి ఉండాలని సదరు సంస్థ భావిస్తోందని, తాను మాత్రం దానితో ఏకీభవించనని తేల్చి చెప్పారు. దీంతో లింక్డ్‌ఇన్ ఆయన పోస్ట్‌లను తొలగించింది. ఇందుకు ప్రతిగా దాని మాతృసంస్థ మైక్రోసాఫ్ట్‌కు ఓలా CEO గట్టి షాక్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications