Bhavish Agarwal: విదేశీ కంపెనీలను వాయకొట్టిన ఓలా సీఈవో.. ఆ రెండు కంపెనీలకు షాక్..
OLA CEO: ప్రస్తుతం భారతదేశంలో లోకల్ కంపెనీల హవా పెరుగుతోంది. స్టార్టప్ ఎకోసిస్టం వల్ల దేశీయంగా యువ వ్యాపారులు అనేక కొత్త కంపెనీలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో విదేశీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితులు చాలా వరకు అనేక రంగాల్లో తగ్గిపోయాయి.
ఈ క్రమంలో ఓలా వ్యవస్థాపకుడు, సీఈవో Bhavish Aggarwal మరోసారి విదేశీ కంపెనీలపై విరుచుకుపడ్డారు. స్వాతంత్య్రానికి ముందు వ్యాపారం పేరుతో ఇండియాకు వచ్చిన ఈస్టిండియా కంపెనీ వంటి విదేశీ సంస్థలు ప్రస్తుతం భారత్ డేటాను దొంగిలిస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిని టేక్నో కలోనియలిజం అని భవిష్ పేర్కొన్నారు. ఈ విదేశీ కంపెనీలు భారతదేశ డేటాను గ్లోబల్ డేటా సెంటర్లకు పంపుతున్నాయన్నారు. అక్కడి నుంచి వాటిని ప్రాసెస్ చేసిన తర్వాత వాటిని ఇండియాకు తిరిగి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.

గతంలో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ కూడా ఇదే విధంగా మన వనరులను దోపిడీ చేసిందని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భవిష్ అగర్వాల్ అన్నారు. అప్పట్లో బ్రిటన్ కంపెనీలు భారతీయ వనరులను తమ స్వలాభం కోసం ఉపయోగించుకున్నాయన్నారు. అలాంటి పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయంటూ.. నేడు విదేశీ కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో ఏ యాప్‌ను వినియోగించుకుంటున్న వారి సంఖ్య కోట్లలో ఉంటుందని తెలిపారు.
ప్రస్తుతం విదేశీ కంపెనీలు భారతీయులకు సంబంధించిన డేటాలో కేవలం 10 శాతం మాత్రమే ఇండియాలోని సర్వర్లలో నిల్వ చేస్తున్నాయని.. 90 శాతం భారతీయుల డేటా దేశం వెలుపల ఉందన్నారు. ఈ బల్క్ డేటాను సదరు కంపెనీలు ఏఐ సాంకేతికతలను వినియోగించి ప్రాసెస్ చేస్తున్నారని, తిరిగి దానిని భారతదేశానికి డాలర్లలో విక్రయిస్తున్నాయని అన్నారు. మన డేటా మన దగ్గరే ఉండేలా మీరు సిస్టమ్‌ని క్రియేట్ చేసుకోవాలన్నారు. ఏఐ రంగంలో ఇండియా చాలా చేయగలదని అగర్వాల్ పేర్కొన్నారు. దీన్ని చేయడానికి మనం మరింత డేటాను రూపొందించాలి.
ఈస్టిండియా కంపెనీ పత్తిని ఎగుమతి చేసి తిరిగి బట్టలు తెచ్చి ఇండియాలో ప్రజలకు విక్రయించేదని ఓలా సీఈవో తెలిపారు. అలాగే టెక్నో వలసవాదం కూడా. భారత పర్యావరణ వ్యవస్థలో ఈ సంఘర్షణ చట్టబద్ధం కాదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది టెక్నాలజీ యుద్ధం. మన సంస్కృతికి అనుగుణంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. దీనికి ముందు ఓలా గూగుల్ మ్యాప్స్ వినియోగం మానేసి తమ సొంత ఓలా మ్యాప్స్‌కి మారింది. అలాగే ఓలా గ్రూప్ ఇటీవల తన కార్యకలాపాలను ఏఐకి మార్చిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 3 నెలల తరువాత మైక్రోసాఫ్ట్ అజూర్‌తో భాగస్వామ్యానికి కంపెనీ ముగింపు పలికింది.


Click it and Unblock the Notifications