Uber News: ప్రముఖ రైడ్ షేరింగ్ సంస్థలు ఓలా మరియు ఉబెర్‌లు ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. ఈ విధానం అటు డ్రైవర్లతో పాటు వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రయాణాలు మరింత చౌక కానున్నట్లు పేర్కొంటున్నారు.
ఓలా మరియు ఉబెర్ లు తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఆటోరిక్షా డ్రైవర్ల కోసం సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ప్లాన్‌లను అందించనున్నాయి. దీంతో ప్రతి రైడ్ పై ఆయా కంపెనీలు కమీషన్ వసూలు చేయడానికి ఫుల్ స్టాప్ పడనుంది. కాగా ఓలా ఈ మోడల్‌ను ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరు మరియు హైదరాబాద్‌లలో విడుదల చేసింది. చెన్నై, కొచ్చి మరియు విశాఖపట్నంలో ఉబెర్ ఈ విధానాన్ని ప్రారంభించినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

రైడ్ హెయిలింగ్ సంస్థల తాజా నిర్ణయంతో ఆటో-రిక్షా రైడ్‌లపై వర్తించే 5 శాతం GSTని దాటవేయవచ్చు. అయితే ఇందులో స్పష్టత లోపించడంతో ఆపరేటర్లు మరియు పన్ను అధికారుల మధ్య భవిష్యత్తులో వివాదాలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉబెర్ ప్రతినిధి ఈ మార్పును ధ్రువీకరించారు. అనేక కంపెనీలు ఇప్పటికే ఈ మోడల్‌లో పనిచేస్తున్నందున రైడర్ లకు ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.
ఇప్పటివరకు ఓలా మరియు ఉబెర్ లు కమీషన్-ఆధారిత ఆదాయ నమూనాను అనుసరించాయి. ప్లాట్‌ఫారమ్ ద్వారా జరిగి ప్రతి రైడ్‌కు ఛార్జీలో కొంత వాటాను కమీషన్ గా కట్ చేసేవి. మిగిలిన మొత్తాన్ని డ్రైవర్ భాగస్వాములకు పంచేవి. అయితే కొత్త మోడల్ ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లు కస్టమర్‌లు మరియు డ్రైవర్ల మధ్య వారధిగా పనిచేస్తాయి. ఇందుకోసం డ్రైవర్ల భాగస్వాముల నుంచి రోజుకు లేదా వారానికి నిర్ధిష్ఠ సబ్‌స్క్రిప్షన్ రుసుమును వసూలు చేస్తాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications