ఏడేళ్ల గరిష్టానికి క్రూడాయిల్ ధరలు, మరింత పెట్రో మంట తప్పదా?

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఏడేళ్ల ళ్ల గరిష్టాన్ని తాకాయి. కరోనా సమయంలో తగ్గిన ఉత్పత్తిని ఇప్పుడే పునరుద్ధరించేందుకు OPEC, అనుబంధ చమురు ఉత్పత్తి దేశాలు సిద్ధంగాలేవు. ఉత్పత్తిని క్రమంగా పెంచనున్నాయి. ఉత్పత్తి పెంపు నెమ్మదిగా ఉండటం, దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పుంజుకోవడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ నెలలో రోజుకు 400,000 బ్యారెల్స్ ఉత్పత్తిని మాత్రమే పెంచాలని నిర్ణయించాయి. మరింత ఉత్పత్తికి ససేమీరా అంటున్నాయి.

ఒపెక్ దేశాల నిర్ణయం నేపథ్యంలో చమురు ధరలు అంతర్జాతీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద మూడో చమురు దిగుమతిదారు, వినియోగదారు భారత్. మన ముడి చమురు అవసరాల్లో 85 శాతం, సహజవాయువు అవసరాల్లో 50 శాతానికి పైగా దిగుమతిపై ఆధారపడి ఉన్నాం. మూడు చమురును పెట్రోల్, డీజిల్‌గా, సహజవాయువును ఆటో మొబైల్ సీఎన్జీగా, ఫ్యాక్టరీలో ఇంధనంగా ఉపయోగించుకుంటాం.

ఉత్పత్తిపై ఆచితూచి

ఉత్పత్తిపై ఆచితూచి

వాస్తవానికి కరోనా దెబ్బతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ముడి చమురు ధరలు తగ్గాలని, ఇందుకు మరింత ఉత్పత్తి మార్కెట్లోకి తీసుకు రావాల్సిన అవసరముందని అమెరికా, భారత్ వంటి దేశాలు భావిస్తున్నాయి. అయితే తాజాగా సమావేశమైన ఒపెక్ ప్లస్ దేశాల బృందం మాత్రం మరోసారి కరోనా ముప్పు పొంచి ఉందనే అంచనాలతో ఉత్పత్తిపై తొందరపాటు సరికాదని భావిస్తోంది.

ఇదే భావనను కనబరుస్తూ గతంలో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంటామని సోమవారం ప్రకటించింది. కరోనాతో వచ్చిపడిన లాక్‌డౌన్లతో ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం పెద్ద ఎత్తున పడిపోయి గ్లోబల్ మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో ఒపెక్ ప్లస్ దేశాలకు నష్టాలు మిగిలాయి. అందుకే ఉత్పత్తి విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

ఏడేళ్ల గరిష్టానికి..

ఏడేళ్ల గరిష్టానికి..

అంతర్జాతీయంగా ప్రామాణికంగా భావించే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 79 డాలర్లు పలుకుతోంది. ఇది మూడేళ్ల గరిష్ఠస్థాయికి దగ్గరలో ఉంది. ఓ సమయంలో 2.8 శాతం లాభపడి 81.48 డాలర్లకు చేరుకుంది. నెల కిందట ఇది 72 డాలర్ల కంటే తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నా కొద్ది భారత్ వంటి ప్రధాన దిగుమతిదారులపై పెరుగుదల ప్రభావం ఉంటుంది. ఈ ధరల్లో పెరుగుదల కాస్తా మార్జిన్లపై ఒత్తిడి తీసుకురావడంతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ద్వారా ఆ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తారు. న్యూయార్క్ మర్చంటైల్ ఎక్స్చేంజ్‌లో క్రూడ్ బ్యారెల్ 2014 తర్వాత ఇదే గరిష్టం. అంటే ఏడేళ్ల గరిష్టం.

ఏప్రిల్ 2022 వరకు రోజుకు 400,000 బ్యారెల్స్ ఉత్పత్తిని మాత్రమే పెంచుతూ వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అంతకుమించి సరఫరాను పెంచితే సరఫరా వైపు ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. అమెరికా, భారత్ వంటి పెద్ద వినియోగదారుల నుండి పెరుగుతున్న ఒత్తిడి కారణంగా త్వరలో సరఫరా పెరుగుతుందని కూడా అంటున్నారు. కానీ అంతకుముందు 40,000 డాలర్ల పెంపుకే మొగ్గు చూపుతున్నాయి. ఒపెక్ నిర్ణయంతో న్యూయార్క్ మర్చంటైల్ ఎక్స్చేంజ్‌లో క్రూడ్ బ్యారెల్ 78.17 డాలర్లకు చేరుకుంది. ఇదే ఏడేళ్ల గరిష్టం.

ఈ స్టాక్స్ జంప్

ఈ స్టాక్స్ జంప్

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో ఫ్యూయల్ స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్ (ONGC) స్టాక్ 4.7 శాతం పెరిగి రూ.154.60, ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2.8 శాతం ఎగిసి రూ.248.4 వద్ద ట్రేడ్ అయింది. భారత్ పెట్రోలియం కార్పోరేషన్ స్టాక్స్ 0.6 శాతం లాభపడి రూ.438.35 వద్ద, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్టాక్ 2 శాతం ఎగిసి రూ.129 వద్ద ట్రేడ్ అయింది. ఓఎన్జీసీ స్టాక్ 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఇండియన్ ఆయిల్ కార్పోరే,న్ స్టాక్ కూడా 52 వారాల గరిష్టానికి చేరుకుంది.

పది రోజుల్లో ఎంత పెరిగిందంటే

పది రోజుల్లో ఎంత పెరిగిందంటే

దేశీయంగా జులై, ఆగస్ట్ నెలల్లో ముడి చమురు ధరలు ఊగిసలాటలో కనిపించాయి. అయితే మిడ్ జులై 18 నుండి మిడ్ సెప్టెంబర్ వరకు చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరల్లో ఎలాంటి పెంపును అమలు చేయలేదు. ఈ సమయంలో మొత్తం మీద లీటర్ పెట్రోలు రూ.0.65, లీటర్ డీజిల్ పైన రూ.1.25 తగ్గించారు.

అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గకపోవడంతో చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు తమ పెట్రోల్, డీజిల్ రిటైల్‌ ధరలను వరుసగా పెంచుతున్నాయి. సెప్టెంబర్ 24వ తేదీ నుండి డీజిల్ లీటర్ ధర రూ.2.15 వరకు పెరగగా, గత వారం రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.1.25 వరకు పెరిగింది.

అంతర్జాతీయంగా ధరలు పెరుగుతుండటంతో చమురు కంపెనీలు మాత్రం రిటైల్ ధరల నిర్ణయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు బ్యారెల్‌కు 85.10 డాలర్ల నండి 87.11 డాలర్లకు ఒకరోజులోనే పెరిగాయి. డీజిల్ ధరలు బ్యారెల్‌కు 85.95 డాలర్ల నుండి 87.27 డాలర్లకు పెరిగాయి. ఎల్పీజీ నెల రోజుల్లో టన్నుకు 655 డాలర్ల నుండి 797 డాలర్లకు పెరిగింది. ఈ పెరుగుదలను చమురు కంపెనీలు కస్టమర్లకు బదలీ చేయలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం మధ్యస్తంగా మాత్రమే పెంచినట్లు చెబుతున్నారు.

కాగా, పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (అక్టోబర్ 5, మంగళవారం) పెరిగాయి. చమురు ధరలు నిన్న (సోమవారం అక్టోబర్ 4) స్థిరంగా ఉన్నాయి. మొన్నటి వరకు ధరలు వరుసగా నాలుగు రోజుల పాటు పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, లీటర్ డీజిల్ పైన 30 పైసలు పెరిగింది. నేడు లీటర్ పెట్రోల్ పైన 25 పైసలు, లీటర్ డీజిల్ పైన 30 పైసలు పెరిగింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆల్ టైమ్ గరిష్టం రూ.102ను దాటింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+