కరోనా వైరస్ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. డౌడోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏకంగా 6.3 శాతం మేర పతనమైంది. అంటే 1,300 పాయింట్లకు ఎక్కువగా పడిపోయింది. దీంతో 19,899 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 2017 తర్వాత మొటిసారి 20,000 పాయింట్లకు దిగువన ముగియడం గమనార్హం.
S&P 500 స్టాక్ 5.2 శాతం మేర పడిపోయాయి. 2,398 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. టెక్ రిచ్ నాస్డక్ 4.7 శాతం కోల్పోయి 6,989 వద్ద క్లోజ్ అయింది. డౌజోన్స్ ఓ సమయంలో ఏకంగా పది శాతం కోల్పోయింది. అయితే కరోనా వైరస్ టెస్టింగ్, సిక్ పేతో పాటు ఈ క్రైసిస్ వల్ల జరిగే వాటి కోసం 100 బిలియన్ డాలర్ల ఎమర్జెన్సీ ప్యాకేజీని అమెరికా సెనేట్ పాస్ చేసింది. ఆ తర్వాత మార్కెట్లు కాస్త కుదురుకున్నాయి. అయినప్పటికీ భారీ నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి.

ఇక, పెట్రోలియం ఉత్పత్తులు కూడా భారీగానే నష్టపోయాయి. 24 శాతం మేర నష్టపోయి బ్యారెల్ 20.37 డాలర్ల వద్దకు కూడా పడిపోయిన సందర్భం ఉంది. అంటే 2002 తర్వాత ఈ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. దిగ్గజ జనరల్ మోటార్స్ 17.3 శాతం, ఫోర్డ్ 10.2 శాతం నష్టపోయాయి.
అయితే ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు కాస్త పెరిగాయి. కరోనా వైరస్ విషయంలో తీసుకుంటున్న చర్యలను, ఆయా దేశాలు ప్రత్యేక ఎమర్జెన్సీ నిధి ఏర్పాటును ఇన్వెస్టర్లు ప్రశంసించారు. దీంతో బ్రెంట్ క్రూడాయిల్ జపాన్‌లో 8 శాతం లేదా 2.10 డాలర్లు ఎగిసి 26.98 వద్ద, యూఎస్ ఆయిల్ 3.44 డాలర్లు లేదా 17 శాతం ఎగిసి 23.81 డాలర్ల వద్ద ఉంది.


Click it and Unblock the Notifications