కరోనా వేరియంట్ ఒమిక్రాన్, ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా గత నాలుగు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ నెలలో 70 డాలర్ల వద్ద ఉన్న క్రూడ్ ధరలు ఓ సమయంలో 140 డాలర్లకు చేరుకొని, ప్రస్తుతం 110 డాలర్ల వద్ద ఉన్నాయి. అంటే యుద్ధం సమయంలో డబుల్ అయి, ప్రస్తుతం 50 శాతం పెరుగుదలతో ఉన్నాయి. దీంతో వివిధ దేశాల్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ మన వద్ద ఈ నాలుగు నెలలుగా ధరల్లో మార్పులేదు. ఇందుకు ఎన్నికలు ప్రధాన కారణం. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా భారీ పెరుగుదల నమోదు కాలేదు. ఇందుకు సామాన్యులపై భారం మోపకుండా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు గాను రష్యా వంటి దేశాలతో తక్కువ ధరకే ఇంధనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. గత నాలుగు రోజుల్లో మూడు రోజులు స్వల్ప పెరుగుదలతో సాగుతున్నాయి.
అంతర్జాతీయ పెరుగుదలకు అనుగుణంగా చమురు రంగ కంపెనీలు గత నాలుగు నెలలుగా ధరలు పెంచలేదు. దీంతో దేశీయ చమురు రంగ కంపెనీలకు రూ.19,000 కోట్లు లేదా 2.25 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు మూడీస్ అంచనా వేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుండి పెరగలేదు. అంతకు రెండో రోజుల ముందు కేంద్రం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 సెస్‌ను తగ్గించి ఊరట కల్పించింది. ఈ వారంలో పెరుగుదల ప్రారంభమైంది.

నవంబర్ నెల చివరి నాటికి 82 డాలర్లుగా ఉన్న బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం 110 డాలర్ల వద్ద ఉంది. దీంతో చమురు కంపెనీలు ఒక్కో బ్యారెల్‌కు రూ.1900 లేదా 25 డాలర్లు, డీజిల్ పైన 24 డాలర్లు లేదా 1800 డాలర్లకు పైగా నష్టపోతున్నట్లు మూడీస్ అంచనా వేసింది. ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచకపోతే రోజుకు ఆయా కంపెనీలు 65 నుండి 70 మిలియన్ డాలర్ల మేర నష్టపోతాయని పేర్కొంది. నవంబర్ నుండి మార్చి తొలి వారం వరకు జరిగిన అమ్మకాల ఆధారంగా సగటును లెక్కగట్టిన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్క మార్చిలోనే తొలి మూడు వారాల్లో 2.25 మిలియన్ డాలర్లు నష్టపోయినట్లు మూడీస్ పేర్కొంది.
More From GoodReturns

Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి మార్చి 29 తాజా రేట్లు ఇవే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

LPG: భారత్‌కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?

Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?

ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications