ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ విమానాశ్రయంపై రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దాడిలో ఇరాన్, ఇరాక్ దేశాలకు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఇరాన్ నిఘా విభాగం ఖడ్స్ ఫోర్స్ అధినేత జనరల్ ఖాసీమ్ సోలేమన్ కూడా మృతి చెందాడు. ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న తిరుగుబాటు సంస్థ పీఎంఎఫ్ డిప్యూటీ కమాండర్ అబు మహది ఆల్ ముహందీస్ కూడా మృతి చెందాడు.

దాడి... 4 శాతం పెరిగిన చమురు ధరలు
కాగా, బాగ్దాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంపై జరిగిన దాడిని తామే చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ధృవీకరించింది. ఖాసీమ్ సోలెమన్‌ను చంపాలన్న అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడి నిర్వహించినట్లు తెలిపింది. ఈ దాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు భయాలు కమ్ముకున్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు 4 శాతం వరకు పెరిగాయి.

ఎంత పెరిగిందంటే?
4 శాతం వరకు పెరిగిన చమురు ధరలు స్థానిక కాలమానం ప్రకారం నిన్న ఉదయం గం.11.14 సమయానికి బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 2.88 శాతం పెరిగి 68.14 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ క్రూడాయిల్ 2.70 శాతం పెరిగి 62.82 శాతం వద్ద ఉంది.

పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా...
తాజా ఘటనతో మధ్య ఆసియా ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ఇరాన్ సహా దానికి మద్దతిస్తున్న దేశాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications