అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరిగాయి. క్రూడ్ ఏకంగా బ్యారెల్‌కు 71 డాలర్లకు చేరుకుంది. చమురు ధరలు 20 నెలల గరిష్టానికి చేరుకున్నాయి.సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ల దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. ఉత్పత్తిని పెంచకూడదని చమురు ఎగుమతి దేశాలు ఇటీవల నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడుల జరగడంతో ధరలు మరింత పెరగడానికి కారణమయ్యాయి.

అందుకే ధరలు జంప్
సోమవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర దాదాపు ఏడాది కాలంలో మొదటిసారి 70 డాలర్లను క్రాస్ చేసింది. ఓ దశలో 71 డాలర్లను చేరుకుంది. నిన్న రాత్రి సమయంలో 1 శాతానికి పైగా క్షీణించి 69 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ముడి చమురు ధరలు ఇప్పటికే ఈ ఏడాది 30 శాతానికి పైగా పెరిగాయి. అమెరికా మార్కెట్ ప్రామాణికమైన వెస్ట్‌టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధర ఓ దశలో ఒక శాతానికి పైగా లాభపడి 66.83 డాలర్ల వద్దకు చేరుకుంది. సౌదీ అరేబియా ప్రపంచంలోని అతిపెద్ద క్రూడ్ ఎగుమతి దేశాల్లో ఒకటి. కరోనా సంక్షోభ ప్రభావం నుండి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కూడా ముడి చమురు ధరల పెరుగుదలకు కారణం.

100డాలర్లకు చేరుకోవచ్చు
భారత మార్కెట్లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో బ్యారెల్ ముడి చమురు ఫ్యూచర్స్ (మార్చి డెలివరీ) ధర ఓ దశలో రూ.47 పెరిగి రూ.4,891కి చేరింది. ఏప్రిల్ నెలలో బ్రెంట్ క్రూడ్ 75 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని వుడ్ మెకెంజీ అంచనా వేసింది. 2021లో రోజువారి క్రూడ్ డిమాండ్ ప్రపంచంలో 63 లక్షల బ్యారెళ్ల మేర పెరుగుతుందని అంచనా వేసింది. 2022 డిసెంబర్ నాటికి క్రూడాయిల్ 100 డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. కరోనా నుండి కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో ముడి చమురు 100 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చునని చెబుతున్నారు.

దాదాపు రెండేళ్ల తర్వాత
సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడి నేపథ్యంలో మే 2019 నుండి చమురు ధరలు ఈ స్థాయికి పెరగడం మొదటిసారి. ప్రపంచ అతిపెద్ద ఆయిల్ షిప్పింగ్ పోర్ట్ పెట్రోలియం ట్యాంక్ కంపెనీపై దాడి జరిగిందని సౌదీ అరేబియా ఎనర్జీ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. డ్రోన్, బాలిస్టిక్ మిసైల్ ద్వారా టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి విధ్వంసకర చర్యలు కేవలం సౌదీ అరేబియా లక్ష్యంగా మాత్రమే కాదని, ప్రపంచ ఇంధన సరఫరా భద్రత, స్థిరత్వానికి దెబ్బ అని, తత్ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని సౌదీ ఎనర్జీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications