భయపెడుతున్న చమురు మంటలు.. 103 డాలర్లకు చేరిన ముడి చమురు ధరలు..ఇంకా ఎగబాకే అవకాశం..

Oil Price Today: పశ్చిమాసియా (మధ్యప్రాచ్య) ప్రాంతంలో యుద్ద ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్లోబల్ కమోడిటీ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. సముద్ర మార్గాల్లో చమురును రవాణా చేసే నౌకలపై దాడులు పెరగడం, అదే సమయంలో అమెరికా తన మూడవ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను ఆ ప్రాంతానికి మోహరిస్తున్నట్లు వార్తలు వెలువడటంతో సరఫరా అంతరాయాలపై వ్యాపారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ ప్రతికూల పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ ముడి చమురు ధర 4.4 శాతం పెరిగి బ్యారెల్‌కు $102.31 వద్ద ముగిసింది. శుక్రవారం ఉదయం ఆసియా మార్కెట్లు తెరుచుకోగానే ఇది మరింత పైకి పాకి బ్యారెల్‌కు $103 మార్కును తాకింది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 2.7 శాతం పెరిగి బ్యారెల్‌కు $92.87 స్థాయికి చేరుకున్నాయి.

Brent Oil Price Crude Oil Price Today Oil Price Today Brent Crude Brent Crude Price Crude Oil News Oil Price Forecast Brent Oil Forecast Middle East Tensions US Third Aircraft Carrier US Iran Tensions Iran War Oil Supply Concerns China Fuel Export Ban WTI Crude WTI Price 100 Brent Crude 102 Brent

చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పశ్చిమాసియాలో సైనిక ఉనికి వేగంగా పెరగడమే. 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం ప్రకారం, శాన్ డియాగో నుండి 'యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్' యుద్ధనౌక పశ్చిమాసియా వైపు బయలుదేరింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో 'యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ. బుష్', 'యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్' వంటి ప్రధాన యుద్దనౌకలు మోహరించి ఉండగా, మరో 10,000 మందికి పైగా అమెరికన్ సైనికులు నవంబర్ నాటికి అక్కడికి చేరుకునే అవకాశముంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇరాన్‌పై సైనిక చర్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని మాజీ సిఐఎ అధికారులు కూడా వ్యాఖ్యానించడంతో మార్కెట్ ఈ సైనిక కదలికలను సంభావ్య యుద్ధ సంకేతంగా భావిస్తోంది.

Also Read

ప్రస్తుతం పశ్చిమాసియా నుండి ముడి చమురు ఉత్పత్తి సాధారణ స్థాయిలోనే జరుగుతున్నప్పటికీ, దాని రవాణా భద్రతపై స్పష్టత లేకపోవడం వ్యాపారులను భయపెడుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' గుండా వెళుతున్న కనీసం మూడు చమురు ట్యాంకర్లపై ఈ వారం దాడులు జరిగినట్లు సముద్ర భద్రతా సంస్థలు ధృవీకరించాయి. రోజువారీ రవాణా బాటలో అడ్డంకులు ఏర్పడటంతో, భవిష్యత్తులో సరఫరాలు నిలిచిపోతాయేమోననే భయం ధరలను ఆకాశానికి నెడుతోంది.

కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా శుద్ధి చేసిన ఇంధనాల (పెట్రోల్, డీజిల్, జెట్ ఫ్యూయల్) కొరత కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యాలోని రిఫైనరీలు దెబ్బతినడంతో ఆ దేశం డీజిల్ ఎగుమతులపై నిషేధం విధించింది. మరోవైపు ఇరాన్ మద్దతుగల హౌతీ బలగాలు కూడా రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. దీనివల్ల అమెరికాలో డీజిల్ ధర గ్యాలన్‌కు $6.40 కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. అమెరికా కూడా ఇంధన ఎగుమతులను నిలిపివేస్తుందేమోననే ప్రచారం జరగడం, చైనా రిఫైనరీలు తమ దేశీయ అవసరాల కోసం అక్టోబర్ జెట్ ఫ్యూయల్, పెట్రోల్ ఎగుమతి ఒప్పందాలను రద్దు చేసుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌‌కు $100 మార్కును దాటడం భారత్ లాంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఆందోళన కలిగించే అంశమే. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెంటనే పెంచే అవకాశం లేకపోయినప్పటికీ, చమురు దిగుమతి మరియు రవాణా వ్యయాలు పెరగడం వల్ల సుదీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగి వ్యాపార వ్యయాలు అధికమయ్యే ముప్పు పొంచి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+