LPG cylinder Price Hike: దేశీయంగా ప్రతినెల మాదిరిగానే చమురు కంపెనీలు గ్యాస్ ధరల్లో అక్టోబర్ 1న మార్పులు తీసుకొచ్చాయి. ఈ క్రమంలో మరోసారి రేట్ల పెంపును ప్రకటించటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి వంటి పండుగలు ఉన్న అక్టోబరు నెలలో సిలిండర్ల ధరలు పెరగటం ప్రజలపై భారాన్ని పెంచుతోంది.
అక్టోబర్ 1న దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను సవరించాయి. ఈ క్రమంలో ఒక్కో సిలిండరు ధర రూ.48.50 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు అక్టోబర్ 1, 2024 నుండి అమలులో ఉంటాయి. తాజా రేట్ల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెరిగిన ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర గతంలో రూ.1,691.50 నుంచి ప్రస్తుతం రూ.1,740కి పెంచబడింది. ఇక కోల్‌కతాలో రూ.1,850.50, ముంబైలో రూ.1,692.50, చెన్నైలో రూ.1,903కి పెంపు తర్వాత చేరుకున్నాయి.

అయితే చమురు సంస్థలు దేశంలో కమర్షియల్ సిలిండర్ల ధరలను వరుసగా మూడోసారి పెంచటం గమనార్హం. అయితే ఈ క్రమంలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగించాలని చమురు కంపెనీలు నిర్ణయించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలను పరిశీలిస్తే.. హైదరాబాదులో 19 కేజీల సిలిండర్ ధర సవరించిన తర్వాత రూ.1,967 వద్ద అందుబాటులో ఉండగా, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ రేటు ఒక్కోటి స్థిరంగా రూ.855 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో విజయవాడ నగరంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రేటు పెరిగిన తర్వాత రూ.1,901 వద్ద లభిస్తుండగా, 14.2 కేజీల సిలిండర్ రేటు రూ.827.50 వద్ద కొనసాగుతోంది.
పండుగల వేళ..
దసరా, దీపావళి వంటి పండుగల ముందు ఎల్‌పిజి సిలిండర్ ధరలు పెరగడం వినియోగదారులకు ద్రవ్యోల్బణం షాక్. ఇది వాణిజ్య రంగంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, ఎందుకంటే రెస్టారెంట్లు, హోటళ్లలో వాణిజ్య సిలిండర్లను పెద్ద ఎత్తున ఉపయోగిస్తారు. డొమెస్టిక్ సిలిండర్ల ధరలను పెంచకపోవడం వల్ల దేశీయ వినియోగదారులకు ఖచ్చితంగా ఉపశమనం లభించింది. అయితే వాణిజ్య సిలిండర్ల ధరల పెరుగుదల మార్కెట్‌లో ధరలపై ప్రభావం చూపవచ్చు.
ఏపీలో ఉచిత సిలిండర్..
ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రజలకు పెద్ద శుభవార్త ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారం చేపట్టిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం తమ హామీల నెరవేర్చటంలో భాగంగా ఇప్పటికే పించన్లు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని దీపావళి నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పండుగల వేళ కంపెనీలు ధరలను పెంచినప్పటికీ ఏపీ సర్కార్ మాత్రం ప్రజలకు భారీ ఊరటను అందిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications