LPG Price Cut: శుభవార్త.. వరుసగా రెండో నెల గ్యాస్ ధరల తగ్గింపు.. ఈ సారి ఎంతంటే..
LPG Gas Price Slash: ప్రతినెల మాదిరిగానే దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు జూలై నెల మెుదటి రోజున సైతం ఎల్‌పీజీ సిలిండర్ల విక్రయ ధరల్లో మార్పులు చేశాయి. దీంతో వరుసగా రెండో నెల రేట్ల తగ్గింపు ప్రకటన వెలువడింది.
దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గింపుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూలై నెల మెుదటి రోజున కమర్షియల్ సిలిండరుకు రూ.30 చొప్పున తగ్గిస్తున్నట్లు దేశంలోని చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో 19 కేజీల గ్యాస్ సిలిండర్లను వినియోగించే వ్యాపారులకు ఇది ఊరటగా నిలవనుంది. అయితే గృహ వినియోగదారులు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు నేటి నుంచి తగ్గించటంతో దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో తగ్గిన ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని దిల్లీలో రూ.1646 వద్ద, కలకత్తాలో రూ.1756 వద్ద, ముంబైలో రూ.1598 వద్ద ఉండగా.. అత్యధికంగా చెన్నైలో రూ.1809.50 రేటు వద్ద నేటి నుంచి సిలిండర్లు విక్రయించనున్నారు. దీనికి ముందు దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన జూన్ మాసంలో సైతం చమురు సంస్థలు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల రేట్లను ఒక్కోదానిపై రూ.70 తగ్గింపును అందించాయి. అలాగే మే మాసంలో చమురు సంస్థలు ఒక్కో సిలిండర్ ధరపై రూ.19 స్వల్ప తగ్గింపును ప్రకటించాయి.
ఇక మెట్రో నగరాల్లో గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ల ధరలు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి. మెట్రో నగరాలైన దిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, చెన్నైలో రూ.818.50, ముంబైలో రూ.802.50గా కొనసాగుతున్నాయి.
ధరలను సవరించిన తర్వాత ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ATF, వంట గ్యాస్ ధరలను ప్రతినెలా 1వ తేదీన సవరించాయి. బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ఇంధనం సగటు ధర, విదేశీ మారకపు రేటుపై ఆధారపడి ఉంటాయి.


Click it and Unblock the Notifications