క్రూడాయిల్ ధరలు ఏడేళ్ళ గరిష్టానికి చేరుకున్నాయి. వరుసగా ఏడోవారం లాభాల్లో ముగిసింది. కొద్ది వారాల క్రితం 70 నుండి 72 డాలర్ల మధ్య ఉన్న వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(WTI), బ్రెంట్ క్రూడ్ ఇప్పుడు 90 డాలర్లు క్రాస్ చేసింది. ఈ కాలంలో దాదాపు 20 డాలర్లకు పైగా పెరిగింది. బ్రెంట్, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రితం సెషన్‌లో భారీ లాభాల్లో ముగిసింది. బ్రెంట్ క్రూడ్ 1.67 డాలర్లు లేదా 1.83 శాతం ఎగిసి 92.78 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 1.68 డాలర్లు లేదా 1.86 శాతం లాభపడి 91.95 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లోనే దాదాపు రెండు శాతం ఎగిశాయి.

ఏ క్రూడ్ ఎంత
నైజీరియా మోస్ట్ వ్యాల్యూడ్ గ్రేడ్ బోనీ లైట్ క్రూడ్ 95 డాలర్లకు పైగా, ఎల్జేరియా సహారన్ బ్లెండ్ 97.50 డాలర్ల వద్ద ఉంది. ఈ రెండు కూడా 100 డాలర్ల దిశగా పరుగులు పెడుతున్నాయి. బోనీ లైట్ క్రితం సెషన్‌లో 3.70 డాలర్లు లేదా 4.05 శాతం, సహారన్ బలెండ్ 4.29 డాలర్లు లేదా 4.60 శాతం లాభపడింది. ఇరాన్ హెవీ కూడా 4.5 శాతం మేర ఎగిసి 88.72 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వివిధ ఒపెక్ దేశాల్లో ముర్బన్ 2.85 శాతం లాభపడి 92.71 డాలర్లు, గిరాసోల్ 4.18 శాతం ఎగిసి 95.47 డాలర్లు, అరబ్ లైట్ 2.42 శాతం లాభపడి 90.28 డాలర్లు, కువైట్ ఎక్స్‌పోర్ట్ బ్లెండ్ 1.04 శాతం లాభపడి 91.23 డాలర్ల వద్ద ముగిశాయి. కేవలం బస్రా లైట్ మాత్రమే 4.78 శాతం నష్టపోయింది.

అందుకే ధరల పెరుగుదల
బ్రెంట్, డబ్ల్యుటీఐ ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. గత అక్టోబర్ తర్వాత మొదటిసారి దీర్ఘకాల లాభాలను(వరుసగా ఏడో వారం లాభం) నమోదు చేసింది. అలాగే, సెప్టెంబర్ 2014 తర్వాత ఇవే గరిష్టం. చమురు ధరలు పెరగడానికి వివిధ అంశాలు ఉన్నాయి. రష్యా - ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, ప్రధాన ప్రపంచ ఉత్పత్తిదారుల మధ్య కొనసాగుతున్న రాజకీయ గందరగోళం నేపథ్యంలో సరఫరా అంతరాయ భయాలు, అమెరికా పరిస్థితులు కారణంగా ఉన్నాయి.

ఈ ఏడాది 20 శాతం జంప్
2022 క్యాలెండర్ ఏడాదిలో క్రూడ్ ధరలు ఇప్పటికే 20 శాతం ఎగిశాయి. బ్రెంట్, డబ్ల్యుటీఐ త్వరలో 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. అమెరికాలో శీతాకాలపు తుఫాను, ముఖ్యంగా టెక్సాస్‌లో మంచుతో నిండిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విపరీతమైన చలి కారణంగా ఉత్పత్తిని తాత్కాలికంగా మూసివేసే అవకాశమున్నందున సరఫరా భయాలకు ఆజ్యం పోసింది.


Click it and Unblock the Notifications