2014 తర్వాత తొలిసారి 90 డాలర్లు దాటిన క్రూడ్ ధరలు
అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(WTI) బ్యారెల్ ధర నేటి సెషన్‌లో 0.70 శాతం లాభపడి 90.96 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ 0.50 శాతం మేర ఎగిసి 91.62 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రూడ్ ధరలు 2014 తర్వాత మొదటిసారి గురువారం మధ్యాహ్నం 90 డాలర్లను క్రాస్ చేశాయి. ఆ తర్వాత కూడా అంతకంతకూ పైకి చేరుతున్నాయి. కొద్ది వారాల క్రితం ఈ క్రూడ్ ధరలు 75 డాలర్ల దిగువన కనిపించాయి. అయితే డిమాండ్, అంతర్జాతీయ పరిణామాలు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు క్రూడ్ పైన ప్రభావం చూపుతున్నాయి.
ఈస్టర్న్ యూరోప్, మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కూడా చమురు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. 2022 క్యాలెండర్ ఏడాదిలోనే బ్రెంట్ క్రూడ్ 17 శాతం, WTI క్రూడ్ ధరలు 20 శాతం పెరిగింది. వచ్చే పదిహేను నుండి పద్దెనిమిది నెలల కాలంలో చమురు ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

కాగా, గత కొద్దిరోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు నేడు(ఫిబ్రవరి 4, 2022) స్థిరంగా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ రంగ సంస్థలు ధరలను యథాస్థితిలో కొనసాగిస్తున్నాయి. మూడు నెలలుగా ధరల్లో దాదాపు మార్పులేదు. అయితే నేడు కొన్ని నగరాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉండనుంది. ఓ వైపు అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరుగుతున్నాయి. బడ్జెట్‌కు తర్వాత కూడా మన వద్ద స్థిరంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications