LPG Price Hike: ప్రతినెల మాదిరిగానే సెప్టెంబర్ మెుదటి తారీఖున సైతం దేశంలోని చమురు ఉత్పత్తి కంపెనీలు తమ గ్యాస్ ధరలను విడుదల చేశాయి. ఈ క్రమంలో సదరు కంపెనీలు 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల రేట్లను రూ.39 మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన కొత్త రేట్లు సెప్టెంబర్ 1, 2024 నుండి అమలులోకి వచ్చాయి.
ఇదే సమయంలో డొమెస్టిక్ వినియోగదారులు ఉపయోగించే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ల రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కొనసాగిస్తున్నాయి. అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల తాజా రేట్లను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.1691, కోల్‌కతాలో రూ.1802, ముంబైలో రూ.1644, చెన్నైలో సిలిండర్ ధర రూ.1855కి చేరుకున్నాయి. ఇక ఎలాంటి మార్పులు లేని డొమెస్టిక్ సిలిండర్ల ధరలు దిల్లీలో రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50 మరియు చెన్నైలో రూ.818.50 వద్ద ఎలాంటి మార్పులు లేకుండా సామాన్యులకు అందుబాటులో కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో ఉజ్వల లబ్ధిదారులకు సిలిండర్లు సాధారణ డొమెస్టిక్ వినియోగదారులు పొందే రేటు కంటే రూ.200 తక్కువకు ఒక్కో సిలిండర్ అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు మాసంలో కమర్షియల్ సిలిండర్ల రేట్లను ఒక్కసారి చూస్తే.. దిల్లీలో రూ.1652.50, కోల్‌కతాలో రూ.1764.50, ముంబైలో రూ.1605గా ఉన్నాయి.
గతంలో డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు..
ప్రస్తుతం గృహ వినియోగదారులు ఉపయోగించే సిలిండర్ల రేట్లు గతంతో పోల్చితే భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకప్పటి రేట్లను పరిశీలిస్తే.. సెప్టెంబర్ 1, 2020న సిలిండర్ రూ.594కి అందుబాటులో ఉన్నాయి. అలాగే సెప్టెంబర్ 2019లో అదే సిలిండర్ ధర రూ.590గా ఉండగా.. 2018లో ధర రూ.820 వద్ద ఉండేది. అయితే సెప్టెంబర్ 2017లో సిలిండర్ రేటు రూ.599గా ఉండేది. అయితే 2016లో మోదీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 2016లో డొమెస్టిక్ సిలిండర్ ధర కేవలం రూ.466.50వద్ద ప్రజలకు అందుబాటులో ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications