LPG Price: పండుగల వేళ గ్యాస్ ధర పెంపు.. సిలిండర్‌కు ఎంత పెరిగిందంటే..??
LPG Price: ప్రతినెల మాదిరిగా దేశంలోని చమురు కంపెనీలు నేడు కూడా గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులను ప్రకటించాయి. అసలే ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సమయంలో మరో పెంపు వచ్చింది.
ఈనెలలో దసరా నవరాత్రులతో పాటు పండుగల సీజన్ ప్రారంభం అవుతున్న వేళ.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను చమురు కంపెనీలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్ పై రూ.209 పెంచాయి. దీనికి ముందు సెప్టెంబర్ మాసంలో దేశీయ గ్యాస్ కంపెనీలు కమర్షియల్ సిలిండర్ పై రూ.157 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రకటించిన ధరలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం మారిన ధరలను పరిగణిస్తే.. కోల్‌కతాలో రూ.1,839.50, ముంబైలో రూ.1,684, చెన్నైలో రూ.1,898 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇక దిల్లీలో రూ.1,731.50 వద్ద, హైదరాబాదులో రూ.1,798.50గా కొనసాగుతున్నాయి. పండుగల ముందు రేట్లను కంపెనీలు పెంచడంపై వాణిజ్య వినియోగదారులు, వ్యాపారులు నిరుత్సాహంగా ఉన్నారు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయలు ధరలు మండిపోతున్న వేళ బయట కనీసం ఆహారం తినలంటే జేబులు ఖాళీ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు వాపోతున్నారు.
ఇదిలా ఉండగా ఏడాదికి పైగా ధరల తగ్గింపుల కోసం వేచి చూసిన సామాన్యులకు మాత్రం కొంత ఊరట లభించింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనంలో వ్యతిరేకతను తగ్గించుకునేందుకు మోదీ సర్కార్ పండుగలకు తగ్గింపును ప్రకటిస్తున్నట్లు 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.200 మేర తగ్గించింది. దీంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.900 వద్ద కొనసాగుతున్నాయి. అయితే ఈ ఊరట ఎన్నికలు ముగిసేంత వరకే అంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం కొన్ని నెలల వరకు ఊరట లభించటంతో వినియోగదారులు ఉపసమనాన్ని పొందుతున్నారు.


Click it and Unblock the Notifications