LPG Rate Hiked: దీపావళి తర్వాత నవంబర్ ఒకటో తారీఖున ప్రతి నెల మాదిరిగానే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను దేశంలోని చమురు కంపెనీలు మార్చాయి. ఈ క్రమంలో మరోసారి సామాన్యులపై గ్యాస్ లిసిండర్ల రేట్ల భారం పడింది. పెంచబడిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల రేట్లు నేటి నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ప్రకటించాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరను రూ.62 పెంచాయి. ఇదే క్రమంలో గృహ వినియోగదారులు ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా కంపెనీలు కొనసాగించాలని నిర్ణయించాయి. తాజాగా రేట్ల పెంపు తర్వాత దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పెరిగిన కమర్షియల్ సిలిండర్ల రేట్లను గమనిస్తే.. దిల్లీలో సిలిండర్ ధర రూ.1740 నుంచి రూ.1802కి పెరిగింది. ఇదే క్రమంలో కోల్‌కతాలో రూ.1850.50కి బదులుగా రూ.1911.50కి సిలిండర్ లభ్యం కానుంది. ముంబైలో సిలిండర్ రూ.1692.50 నుంచి రూ.1754కి పెరిగింది. చెన్నైలో సిలిండర్ గతంలో ఉన్న రూ.1903 ధర నుంచి ప్రస్తుతం రూ.1964కి అందుబాటులో ఉంటుంది.

14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2023లో చివరిగా రూ.100 తగ్గించిన నాటి నుంచి ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో సాధారణ వినియోగదారులకు రేట్లను పరిశీలిస్తే.. దీల్లీలో దీని ధర రూ.803, కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50. అయితే ఉజ్వల యోజన లబ్ధిదారులకు మాత్రం సిలిండర్లు ఒక్కోటి రూ.200 అదనపు తగ్గింపుతో రూ.603గా విక్రయించబడుతున్నాయి.
గడచిన కొన్ని నెలలుగా దేశంలోని చమురు సంస్థలు కమర్షియల్ 19 కిలోల సిలిండర్ ధరలను మాత్రం వరుసగా పెంచుతున్న సంగతి తెలిసిందే. దీపావళి తర్వాత మెుదలవుతున్న కార్తీక మాసంతో పాటుగా పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అవుతోంది. ఇలాంటి పండుగలు, శుభకార్యాల సమయంలో ప్రజలపై రేట్ల పెంపుతో అదనపు భారం మోపడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అలాగే దీపావళి సీజన్ తర్వాత విమాన ప్రయాణికులకు చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. జెట్ ఇంధన ధరలను పెంచాయి. దీంతో రానున్న రోజుల్లో విమాన టిక్కెట్లు ఖరీదయ్యే అవకాశం ఉంది. కేజీకి రేటు రూ.3 వేలు పెరుగుతుందని ప్రకటించాయి.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలను గమనిస్తే హైదరాబాదులో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ప్రస్తుతం ధరల పెంపుతో రూ.2028కి అందుబాటులో ఉండగా, విజయవాడలో దీని ధర రూ.1962 వద్ద అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. అయితే దేశంలోని వివిధ నగరాలకు గ్యాస్ తరలింపులకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా రేట్లలో స్వల్ప తేడాలు ఉంటాయని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. అలాగే ఇదే క్రమంలో హైదరాబాద్ నగరంలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855.50 వద్ద విక్రయించబడుతోంది. ఇక విజయవాడలో రేటు రూ.827.50గా ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications