న్యూఢిల్లీ: చమురు ధరలు బుధవారం (జనవరి 27) సరికొత్త గరిష్టాలను తాకాయి. పలు ముఖ్య నగరాల్లో ధరలు రూ.90 మార్కును దాటాయి. గత పది వారాల్లో పెట్రోల్ పన రూ.5.25, డీజిల్ పైన రూ.6.25 చొప్పున పెరిగింది. దీంతో ధరలు సరికొత్త గరిష్టాలను తాకాయి. నేడు పెట్రోల్ ధరలు 22 పైసల నుండి 25 పైసల మధ్య, డీజిల్ 25 పైసల నుండి 27 పైసల మధ్య పెరిగింది.

ఏ నగరంలో ఎంతంటే
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్‌కు 25 పైసలు పెరగడంతో రూ.86.05 నుండి రూ.86.30గా ఉంది. డీజిల్ ధర 76.48కు చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్ 24 పైసలు పెరిగి రూ.87.69, డీజిల్ పైన 25 పైసలు పెరిగి రూ.80.08కి పెరిగింది. ముంబైలో పెట్రోల్ రూ.92.86, డీజిల్ రూ.83.30, చెన్నైలో పెట్రోల్ రూ.88.82, డీజిల్ రూ.81.71కి పెరిగింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.83.46కు చేరుకుంది.
గత పది వారాల్లో పెట్రోల్ పన రూ.5.25, డీజిల్ పైన రూ.6.25 చొప్పున పెరగగా, 2021 సంవత్సరంలో పెట్రోల్ పైన రూ.2.59, డీజిల్ పైన రూ.2.61 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో జంప్
దాదాపు నెలరోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు జనవరి 6వ తేదీ నుండి తిరిగి పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కావడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. దీంతో దేశీయ చమురు సంస్థలు కూడా ధరలను సవరిస్తున్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్ ధరలు బ్యారెల్‌కు 11 సెంట్లు పెరిగి 56.02 డాలర్లు, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 10 సెంట్లు పెరిగి 52.71 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

సరికొత్త గరిష్టాలకు...
2018 నవంబర్ నెలలో ఉన్న లీటర్ పెట్రోల్ ధర రూ.89.06, డీజిల్ రూ.82.53. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఆ తర్వాత ఇటీవల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముంబై వంటి చోట్ల పెట్రోల్ ధర రూ.92ను క్రాస్ చేసింది. జనవరి మొదటి 21 రోజుల్లో 9.65 కోట్ల లీటర్ల పెట్రోలు, 18.73 కోట్ల లీటర్ల డీజిల్ విక్రయాలు జరగగా, గత ఏడాదితో పోలిస్తే దాదాపు పెట్రోల్ దాదాపు పది శాతం, డీజిల్ దాదాపు ఏడు శాతం అధికంగా విక్రయించారు.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications