Vijayawada Metro: విజయవాడ మెట్రోపై కీలక అప్‌డేట్.. పనులు ఎప్పటి నుంచి ప్రారంభమంటే..!
విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు భారీగా ఖర్చు కానుంది. మొదటి దశకే దాదాపు రూ.11 వేల కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి రెండు మార్గాల్లో ట్రాక్ నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశ పనులను పనులు చేపట్టేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారులు భూ సేకరణపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూ సేకరణ కొనసాగుతున్నట్లు తెలిసింది.
అధికారులు కేసరపల్లి, గన్నవరం ప్రాంతాలలో పర్యటించి భూసేకరణ ప్రక్రియపై భూ నిర్వాసితులతో చర్చలు జరుపుతున్నారు. తొలి దశలో 38.40కిలోమీటర్ల మేర లైట్ రైల్ ట్రాన్సిట్ వ్యవస్థని ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కారిడార్ వన్ లో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఒక కారిడార్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు మరో కారిడార్ కు ప్లాన్ చేశారు. ఇందులో మొదటి కారిడారులో 25.9కిలోమీటర్ల నిర్మాణం చేయనుండగా.. రెండో లో 12.5కిలోమీటర్ల మేర కారిడార్ నిర్మించనున్నారు.

మెట్రో రైలు రెండు కారిడార్లు నిర్మించడానికి సుమారు 91 ఎకరాల భూమి అవసరం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు రెవెన్యూ అధికారులతో భూసేకరణ సంబంధించి ఇప్పటికే మాట్లాడారు. ఈ రెండు కారిడార్లలో దాదాపు 34 మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. కేసరపల్లి వద్ద మెట్రో రైలు డిపో నిర్మించనున్నారు. 34 మెట్రో స్టేషన్లు, మెట్రో రైలు డిపోకు ఎక్కువ భూములు అవసరం పడతాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూములు మినహాయించి.. ప్రైవేటు స్థలాలను గుర్తించి భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడానికి రెవెన్యూ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలో భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
భూ సేకరణ పూర్తి అయిన వెంటనే మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. అయితే భారీ రద్దీలేని విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మిస్తే ఆదాయం వస్తుందా రాదా అనే దానిపై కూడా చర్చ జరగాలని కొందురు చెబుతున్నారు. పెద్ద నగరమైన హైదరాబాద్ లోనే మెట్రోకు నష్టాలు వస్తున్నాయి. అలాంటి విజయవాడలో మెట్రో వర్కవుట్ అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications