Allied Blenders IPO: దేశంలో ఎన్నికల వేడి పూర్తవటంతో ఇన్వెస్టర్లు మళ్లీ ఐపీవోలపై దృష్టి సారిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వరుసగా వస్తున్న ఐపీవోల్లో తాజాగా ఒక లిక్కర్ కంపెనీ రావటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ప్రముఖ సంస్థపై బెట్టింగ్ వేసేందుకు చాలా మంది డబ్బును సిద్ధం చేసుకుంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ మేకర్ అలైడ్ బ్లెండర్స్ కంపెనీ గురించే. ఈ కంపెనీ ఉత్పత్తులు ఇప్పటికే దేశంలో చాలా మంది కస్టమర్లను కలిగి ఉన్నాయి. తాజాగా కంపెనీ ఐపీవో ద్వారా రూ.1500 కోట్లను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి సమీకరించాలని చూస్తోంది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో ఇష్యూ జూన్ 25న ప్రారంభం కానుంది. ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు జూన్ 25 నుంచి 27 వరకు అవకాశం ఉంది. అయితే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఇది ఒకరోజు ముందుగానే అందుబాటులో ఉండనుంది. ఇష్యూ తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.7,860 కోట్లుగా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.267-281గా కంపెనీ నిర్ణయించింది.

ఐపీవో ఇష్యూను పరిశీలిస్తో ఇందులో రూ.1000 కోట్లకు తాజా ఈక్విటీ షేర్ల జారీ ఉండగా.. మిగిలిన రూ.500 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుందని కంపెనీ వెల్లడించింది. OFS కింద బీనా కిషోర్ ఛబ్రియా, రేషమ్ ఛబ్రియా, జితేంద్ర హేమ్‌దేవ్, నీషా కిషోర్ ఛబ్రియా తమ షేర్లను విక్రయిస్తారు. తాజా ఐపీవో ద్వారా కొత్తగా సేకరించిన మెుత్తంలో రూ.720 కోట్లను కంపెనీ రుణాల చెల్లింపుకు వినియోగించనున్నట్లు వెల్లడైంది. ఒక భాగం సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ రుణాలు మెుత్తం రూ.808 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ఐపీవో సొమ్మును లిక్కర్ కంపెనీ వినియోగించాలని చూస్తోంది.
అలైడ్ బ్లెండర్స్ భారత్‌తో పాటుగా అంతర్జాతీయంగా మద్య పానీయాల తయారీ, మార్కెటింగ్, విక్రయ వ్యాపారంలో ఉంది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కాతో సహా వివిధ రకాల భారతీయ తయారు చేసిన విదేశీ మద్యం ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ, స్టెర్లింగ్ రిజర్వ్ విస్కీ, జాలీ రోజర్ రమ్, క్లాస్ 21 వోడ్కా వంటి బ్రాండ్ల కింద తన విక్రయాలను నిర్వహిస్తోంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.1.6 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా ఆదాయం 17.2 శాతం పెరిగి రూ.3,146.6 కోట్లకు చేరుకుంది. డిసెంబర్ 2023తో ముగిసిన తొమ్మిది నెలల కాలంలో లాభం ఏడాది ప్రాతిపదికన 46.8 శాతం పెరిగి రూ.4.2 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications