న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020 క్యాలెండర్ ఏడాదిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ భారీగా క్షీణించింది. అయితే రెండో అర్ధ సంవత్సరంలో పుంజుకుంది. హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఆఫీస్ కార్యాలయ లీజింగ్ పెరిగినట్లు నైట్ ఫ్రాంక్ తెలిపింది. హైదరాబాద్ సహా నగరాల్లో ఇళ్ల కొనుగోళ్లు పెరిగిన విషయం తెలిసిందే. అలాగే, కార్యాలయ స్థలం కూడా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో పుంజుకున్నట్లు తెలిపింది.

హైదరాబాద్ నగరంలో ఇలా...
గత ఏడాది ద్వితీయార్థంలో హైదరాబాద్ నగరంలో 38 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు. అదే సమయంలో 49 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్థల నిర్మాణం పూర్తయింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ఆఫీస్ స్థలాన్ని లీజ్‌కు తీసుకోవడం 640 శాతం పెరిగిందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. కరోనా వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందనే వార్తల నేపథ్యంలో విస్తరణ కోసం వ్యాపార సంస్థలు భవిష్యత్తు ప్రణాళికతో కార్యాలయాలను అద్దెకు తీసుకున్నాయి.

ఈ కంపెనీల నుండి ఆఫీస్ స్థలానికి డిమాండ్
ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సురెన్స్(BFSI) విభాగానికి చెందిన కంపెనీల నుండి ఆఫీస్ స్థలానికి డిమాండ్ పెరిగింది. 2019 ద్వితీయార్ధంతో పోలిస్తే 2020 ద్వితీయార్ధంలో BFSI సంస్థలు 30 శాతం ఎక్కువగా ఆఫీస్ కార్యాలయాలు తీసుకున్నాయి. రెండు పెద్ద కంపెనీలే దాదాపు పది లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోం వల్ల డిమాండ్ తగ్గదు
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 2020 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 271 శాతం పెరగడం గమనార్హం. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, పుణే, అహ్మదాబాద్, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఆఫీస్ స్పేస్ డిమాండ్ క్రమంగా పెరుగుతోందని, పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఉద్యోగులు ఎక్కడి నుండి అయినా పని చేయడం వల్ల ఆఫీస్ స్పేస్ లీజింగ్ డిమాండ్ తగ్గదని నైట్ ఫ్రాంక్ చీఫ్ ఎకనమిస్ట్ అండ్ నేషనల్ డైరెక్టర్ రీసెర్చ్ రజని సిన్హా అన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications