కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ ఇటీవలి కాలంలో దారుణంగా పడిపోయింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2020 క్యాలెండర్ ఏడాదిలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 44 శాతం క్షీణించి 25.82 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పడిపోయింది. ఈ మేరకు జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. కరోనా కారణంగా మార్చి నుండి వివిధ రంగాల్లోని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. 2019లో నికర ఆఫీస్ స్పేస్ లీజింగ్ 46.5 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా నమోదయింది. దీంతో పోలిస్తే దాదాపు సగం పడిపోయింది.

2019 జంప్.. 2020లో భారీ డౌన్
జనవరి-మార్చి కాలంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 8.8మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా నమోదయింది. అదే సమయంలో రెండో త్రైమాసికంలో ఇది 3.32 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పడిపోయింది. మార్చి చివరి వారంలో లాక్ డౌన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ భారీగా పడిపోయింది. 2019లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ కొత్త గరిష్టాలను తాకిందని, 46 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు చేరుకుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే 2020లో 44 శాతం పడిపోయిందని తెలిపింది.

డిమాండ్ తగ్గి, క్రమంగా పెరిగి...
ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాల్లో 2019లో ఆఫీస్ స్పేస్ కోసం 46.5 మిలియన్ స్క్వేర్ ఫీట్ల ఆఫీస్ స్పేస్ లీజ్ ఒప్పందాలు కుదిరాయి. కరోనా వల్ల ఈసారి దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలను వాయిదా వేశాయి. అయితే కరోనా లాక్‌డౌన్ నిబంధనలను కేంద్రం విడతల వారీగా తగ్గించింది. దీంతో ఆఫీస్ స్పేస్ కోసం లీజ్ డిమాండ్ అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య 22 శాతం పెరిగిందని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. అంటే గత ఏడాది 5.43 మిలియన్ స్క్వేర్ ఫీట్ల నుంచి ఈ ఏడాది 8.27 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెరిగింది.

సగటు ఆఫీస్ స్పేస్..
సగటు ఆఫీస్ స్పేస్ ఉపయోగం 2016-2018 మధ్య మరింత వాస్తవిక దృక్పథకం కనబరించిందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ అండ్ సీఈవో రమేష్ నాయర్ తెలిపారు. దక్షిణాది మార్కెట్లు అయిన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో నికర ఆఫీస్ స్పేస్ వినియోగం 81 శాతానికి చేరిందని తెలిపారు. ప్రత్యేకించి ఆఫీస్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై లాక్‌డౌన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని తెలిపారు.


Click it and Unblock the Notifications