October Bank Holidays: ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. కొత్తగా ప్రారంభమవుతున్న అక్టోబర్ మాసంలో దాదాపుగా 20 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.సాధారణ వారాంతపు సెలవులతో పాటు పండుగలు, జాతీయ దినోత్సవాల కారణంగా ఈ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే అధికారికంగా ఈ జాబితాను విడుదల చేసింది. అందువల్ల కస్టమర్లు తమ ఆర్థిక సంబంధిత పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
భారతదేశంలో టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ 2025
ముఖ్యంగా పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, చెక్ క్లియరెన్స్ వంటి సేవల కోసం బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు మూసివేసినా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి. అలాగే నగదు ఉపసంహరణ కోసం ATMలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్‌లో బ్యాంకు సెలవుల జాబితా
అక్టోబర్ 1: మహర్నవమి, దుర్గాపూజల కారణంగా అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, పాట్నా వంటి నగరాల్లో సెలవు.
అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, దసరా, తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సెలవు.
అక్టోబర్ 3: దుర్గాపూజ సందర్భంగా గాంగ్‌టక్‌లో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 5: ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా సెలవు.
అక్టోబర్ 6: లక్ష్మీపూజ సందర్భంగా అగర్తల, కోల్‌కతాలో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 7: వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ సందర్భంగా బెంగళూరు, భువనేశ్వర్, సిమ్లా వంటి ప్రాంతాల్లో సెలవు.
అక్టోబర్ 10: కర్వా చౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంకులు మూసివేత.
అక్టోబర్ 11: రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
అక్టోబర్ 12: ఆదివారం సందర్భంగా బ్యాంకులు బంద్.
అక్టోబర్ 18: కటి బిహు సందర్భంగా గౌహతిలో బ్యాంకు సెలవు.
అక్టోబర్ 19: ఆదివారం కావడంతో సెలవు.
అక్టోబర్ 20: దీపావళి, నరక చతుర్దశి, కాళీపూజ సందర్భంగా అహ్మదాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 21: దీపావళి, గోవర్ధన్ పూజ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముంబయి, నాగ్‌పూర్, శ్రీనగర్ సహా పలు నగరాల్లో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 22: దీపావళి, విక్రమ్ నూతన సంవత్సరం, బలిపాడమి సందర్భంగా ముంబయి, పాట్నా, గ్యాంగ్‌టక్ సహా పలు ప్రాంతాల్లో బ్యాంకు సెలవు.
అక్టోబర్ 23: భాయ్‌దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 25: నాలుగో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా సెలవు.
అక్టోబర్ 26: ఆదివారం సందర్భంగా బ్యాంకులు మూసివేత.
అక్టోబర్ 27: ఛఠ్‌పూజ సందర్భంగా కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో బ్యాంకులు బంద్.
అక్టోబర్ 28: ఛఠ్‌పూజ సందర్భంగా మళ్లీ కోల్‌కతా, పాట్నా, రాంచీల్లో సెలవు.
అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్‌లో బ్యాంకులు బంద్.
బ్యాంకులు 20 రోజులు మూసివేయబడతాయి కానీ అవి దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని చోట్ల మూసివేయబడవు.రాష్ట్రాల వారీగా, పండుగల ప్రకారం సెలవులు మారుతాయి. కాబట్టి కస్టమర్లు తమ ప్రాంతానికి సంబంధించిన RBI సెలవుల జాబితాను పరిశీలించడం అవసరం.కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలు ముందుగానే పూర్తి చేసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు. ATMలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్‌లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications