Vedanta: అదానీ తర్వాత వేదాంతను టార్గెట్ చేసిన OCCRP.. మ్యాటర్ ఏంటంటే..??
Vedanta News: మైనింగ్ వ్యాపారంలో మకుటంలేని మహారాజు అనిల్ అగర్వాల్. ఈ బీహారీ బిలియనీర్ కంపెనీలు తలకు మించిన అప్పుల భారంతో ఉన్నట్లు గత కొంత కాలంగా రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై సంచలన ఆరోపణలు బయటపడ్డాయి.
తాజాగా అదానీ గ్రూప్ కంపెనీల తర్వాత జార్జ్ సొరోస్ కు చెందిన OCCRP ఇప్పుడు వేదాంత గ్రూప్ ను టార్గెట్ చేసింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) తాజా కథనంలో అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత కొవిడ్ -19 మహమ్మారి సమయంలో కీలకమైన పర్యావరణ నిబంధనలను బలహీనపరిచే "కోవర్ట్" లాబీయింగ్ ప్రచారం వెనుక ఉన్నట్లు తెలిపింది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం దీనిపై ప్రజల సంప్రదింపులు లేకుండానే.. నిపుణులు చట్టవిరుద్ధమైన పద్ధతులను ఉపయోగించి మార్పులను ఆమోదించిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

జనవరి 2021లో వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ మాజీ పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్‌తో మాట్లాడుతూ.. కొత్త పర్యావరణ అనుమతులు పొందకుండానే మైనింగ్ కంపెనీలను 50 శాతం వరకు ఉత్పత్తిని పెంచడానికి అనుమతించడం ద్వారా భారతదేశ ఆర్థిక పునరుద్ధరణకు ప్రభుత్వం "ఉత్సాహాన్ని" జోడించగలదని చెప్పారు. అలాగే వేదాంతకు చెందిన చమురు వ్యాపారం, కెయిర్న్ ఇండియా, ప్రభుత్వ వేలంలో గెలిచిన చమురు బ్లాకులలో అన్వేషణాత్మక డ్రిల్లింగ్ కోసం పబ్లిక్ హియరింగ్‌లను రద్దు చేయటానికి విజయవంతంగా లాబీయింగ్ చేసినట్లు ఓసీసీఆర్పీ వెల్లడించింది.

రాజస్థాన్‌లో కెయిర్న్ ఆరు వివాదాస్పద చమురు ప్రాజెక్టులకు స్థానిక వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆమోదించినట్లు పేర్కొంది. అయితే ఈ విషయాలను OCCRP సమాచార హక్కు కింద పొందిన వేలాది భారత ప్రభుత్వ పత్రాలను విశ్లేషించటం ద్వారా సంగ్రహించినట్లు తెలిపింది. పైగా ఈ రికార్డుల్లో అంతర్గత మెమోలు, క్లోజ్డ్-డోర్ సమావేశాల నిమిషాల నుంచి, వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ నుంచి వచ్చిన లేఖలలోని సమాచారం కూడా ఉన్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications