Prithvi Raj Singh: దేశంలో ప్రముఖ హోటల్ చైన్ ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ ఛైర్మన్ ఎమెరిటస్ పృథ్వీ రాజ్ సింగ్ కన్నుమూశారు. దీంతో వ్యాపార పరిశ్రమలోని ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
పృథ్వీ రాజ్ సింగ్ ఒబెరాయ్ తన 94వ ఏట కన్నుమూశారు. దేశానికి చేసిన అసాధారణ సేవకు భారత ప్రభుత్వం ఆయనను రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో 2008లో గౌరవించింది. ఆయన 2022లో EIH లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, EIH అసోసియేటెడ్ హోటల్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా తన పదవులను విడిచిపెట్టారు. అయితే ఆయన అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఒబెరాయ్ ఫామ్, కపషేరాలో నిర్వహించనున్నాయి.

భారతదేశంతో పాటు యునైటెడ్ కింగ్‌డమ్(UK), స్విట్జర్లాండ్‌లో పృథ్వీ రాజ్ సింగ్ చదువుకున్నారు. ప్రముఖ నగరాల్లో అనేక లగ్జరీ హోటళ్లను ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ లగ్జరీ ప్రయాణికుల కోసం ఒబెరాయ్ హోటళ్లను తీర్చిదిద్దిన ఘనత ఒబెరాయ్‌కు దక్కింది. ఆతిథ్య పరిశ్రమలో ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా కంపెనీ తన హోటల్ చైన్ నిర్వహిస్తోంది. దూరదృష్టి గల నాయకుడిగా ఉన్న ఆయన అచంచలమైన అంకితభావంతో ప్రపంచ వ్యాప్తంగా తన హోటళ్లను అత్యుత్తమమైనవిగా గుర్తింపును సంపాదించేలా తీర్చిదిద్దారు.
PRS ఒబెరాయ్ నాయకత్వంలో ఒబెరాయ్ గ్రూప్ అపూర్వమైన విజయాన్ని సాధించింది. కార్పొరేట్ ప్రపంచంలో విజయంతో పాటు తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక మందికి సేవలను అందిస్తూ ప్రఖ్యాతిగాంచారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications