Bonus Shares: గత కొంత కాలంగా మార్కెట్లోకి వచ్చి న ఐపీవోలు చాలా మంది ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేశాయి. అయితే ఈ క్రమంలో మార్కెట్లోకి వచ్చిన నాటి నుంచే సంచలనంగా వార్తల్లో నిలిచిన కంపెనీ Nykaa. ప్రస్తుతం ఈ కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించటంతో మరోసారి వార్తలో నిలిచింది.

మార్కెట్లో ర్యాలీ..
బోనస్ షేర్ల ప్రకటనతో ఫ్యాషన్ అండ్ కాస్మోటిక్స్ ఆన్‌లైన్ రిటైలర్ Nykaa స్టాక్ నిన్న మార్కెట్లో 11 శాతం మేర పెరిగాయి. ఈ రోజు కూడా స్టాక్ 1 శాతం మేర స్వల్పంగా లాభపడి రూ. 1,317.20 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇన్వెస్టర్లకు 5:1 నిష్పత్తితో బోనస్ షేర్లను ఇవ్వాలని నిర్ణయించినట్లు కంపెనీ బోర్డు ప్రకటించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీలో ఒక షేర్ కలిగి ఉంటే.. అతనికి 5 బోనస్ షేర్లు పొందుతారు. దీని కోసం కంపెనీ నవంబర్ 3, 2022 రికార్డ్ డేట్‌గా ఫిక్స్ చేసింది.

కంపెనీ వ్యాపారం..
Nykaa ఆన్‌లైన్ మాధ్యమం ద్వారా బ్యూటీ, హెల్త్, ఫిట్‌నెస్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఉత్పత్తులను తయారు చేయడం, విక్రయించడం, పంపిణీ వ్యాపారాన్ని చేస్తోంది. అయితే గత ఆరు నెలల్లో దీని పనితీరు బాగా లేదు. ఈ కాలంలో స్టాక్ ఏకంగా 20 శాతం మేర నష్టపోయింది. అయితే తాజాగా కంపెనీ షేర్లు భారీగా లాభపడ్డాయి. గతేడాది నవంబర్ 26న ఈ షేరు రికార్డు స్థాయి ధర అయిన రూ.2,574ని చేరుకోగా, ఈ ఏడాది మే 12న 52 వారాల కనిష్ఠమైన రూ.1,208.40ను తాకింది.

కంపెనీ లిస్టింగ్..
Nykaa మాతృ సంస్థ FSN ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ గత సంవత్సరం స్టాక్ మార్కెట్లోకి ఐపీవోగా వచ్చి లిస్ట్ అయ్యింది. ఆ సమయంలో షేర్ ఏకంగా 82.58 శాతం లాభంతో లిస్టింగ్ జరిగింది. కంపెనీ షేర్లను రూ.1,125 ధరకు ఇష్యూ చేసినప్పటికీ.. అది 929.05 ప్రీమియంతో రూ.2,054.05 ధరకు మార్కెట్లో లిస్ట్ అయి సంచలనం సృష్టించింది. అలా లిస్టింగ్ సమయంలోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుకం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.62,490 కోట్లుగా ఉంది.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications