Nykaa Shares: ఐపీవోగా వచ్చి సంచలనాలు సృష్టించిన ఫ్యాషన్ అండ్ కాస్మోటిక్స్ ఆన్‌లైన్ రిటైలర్ నైకా గత సంవత్సరం స్టాక్ మార్కెట్లో దూసుకుపోయింది. ఆ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లను ఈ స్టాక్ ధనవంతులను చేసింది. అయితే ఇప్పుడు స్టోరీ రివర్స్ అవుతోంది.

లిస్టింగ్ ప్రైస్..
ప్రస్తుతం నైకా షేర్ల ధర లిస్టింగ్ ధర కంటే తక్కువగా చేరుకుంది. మంగళవారం బీఎస్ఈలో కంపెనీ షేర్ల ధర 2 శాతానికి పైగా తగ్గి రూ.1,107 వద్ద ఉంది. కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన సమయంలో దాని ఇష్యూ ధర రూ.1,125గా ఉంది. గత నెలలో స్టాక్ ఏకంగా 15 శాతం ధరను కోల్పోయింది. ఈరోజు NSEలో ఉదయం 11.12 గంటలకు స్టాక్ ధర రూ.34 కోల్పోయి రూ.1,110 వద్ద ట్రేడ్ అవుతోంది.

మరో పేటీఎం అవుతుందా..?
గతంలో వచ్చిన చాలా టెక్ ఆధారిత ఐపీవో పేటీఎం నష్టాలను నమోదు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ స్టాక్ అనేక మంది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇదే సమయంలో టెక్ బేస్డ్ అనేక ఐపీవోలు కూడా అధిక వ్యాల్యూయేషన్ల కారణంగా భారీగా షేర్ విలువను కోల్పోయాయి. అయితే నైకా షేర్ల లాక్ ఇన్ పిరియడ్ ముగిసే గడువు దగ్గర పడుతున్న తరుణంలో షేర్ ధర ఇష్యూ కంటే పడివోవటం చాలా మందిలో ఆందోళనకు కారణంగా మారింది. మళ్లీ రిటైలర్లు అడ్డంగా బుక్ అవుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కంపెనీ వ్యాపారం..
గత సంవత్సరం నవంబర్ 26న రికార్డు స్థాయి రూ.2,574ను తాకింది Nykaa షేర్. అయితే ప్రస్తుతం ఈ షేర్ అక్కడి నుంచి 56 శాతం పతనమై మార్కెట్లో ట్రేడ్ అవుతోంది. కేవలం 3 నెలల్లో 23 శాతం షేర్ విలువను కోల్పోయిన ఈ కంపెనీ.. బ్యూటీ, వెల్‌నెస్, ఫిట్‌నెస్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ప్రోడక్ట్‌లను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తోంది.

నవంబర్ 10 తర్వాత..
ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్ల లాక్-ఇన్ గడువు నవంబర్ 10న ముగుస్తుంది. గడువు ముగిసే రోజున దాదాపు 67 శాతం లేదా 31.9 కోట్ల షేర్లు ట్రేడ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని JM ఫైనాన్షియల్ అభిప్రాయపడింది. స్టెడ్‌వ్యూ క్యాపిటల్ మారిషస్ లిమిటెడ్, TPG గ్రోత్ IV SF Pte. Ltd, Lighthouse India Fund III, HNIలతో పాటు హరిందర్‌పాల్ సింగ్ బంగా, నరోతమ్ సెఖ్‌సరియా, సునీల్ కాంత్ ముంజాల్ తమ హోల్డింగ్‌లను విక్రయించడానికి అర్హతను పొందుతాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications