Bonus Shares: మార్కెట్లో ప్రస్తుతం కంపెనీలు వరుసగా రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు మంచి ఆదాయాలతో పాటు తమ ఇన్వెస్టర్లకు డివిడెండ్, బోనస్ షేర్లను అందిస్తున్నాయి. అయితే ఈ నెలలో రెండు కంపెనీలు భారీగా బోనస్ షేర్లను ఇస్తున్నాయి.

ఉచిత షేర్లు..
మంచి లాభాలను ఆర్జించే కంపెనీలు తమ ప్రస్తుత వాటాదారులకు ఉచిత షేర్లను అందిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. కంపెనీలు లాభాలను నేరుగా ఇన్వెస్టర్లకు చెల్లించటానికి బదులుగా.. షేర్ల రూపంలో సంపాదనలో కొంత భాగాన్ని అందిస్తున్నాయి. రికార్డు తేదీ తర్వాత ఎక్స్ బోనస్‌తో ట్రేడ్ అవనున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Nykaa కంపెనీ..
ఇటీవల ఆన్ లైన్ కాస్మెటిక్స్ విక్రయదారు నైకా మంచి త్రైమాసిక లాభాలను ప్రకటించింది. ఒక్కో షేరుకు 5 బోనస్ ఈక్విటీ షేర్లను ఇవ్వాలని కంపెనీ బోర్డు అక్టోబర్ 3న నిర్ణయించింది. దీనికి నవంబర్ 11న రికార్డు తేదీగా కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ స్టాక్ నవంబర్ 10న ఎక్స్-బోనస్‌గా ట్రేడ్ అవుతుంది. గత సంవత్సరం నవంబర్ లో ఈ షేర్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. సోమవారం కంపెనీ షేర్లు 2.48% పెరిగి రూ.1,132 వద్ద ముగిసింది.

పునిత్ కమర్షియల్స్..
స్మాల్ క్యాప్ కంపెనీ అయిన పునిత్ కమర్షియల్స్ లిమిటెడ్ సైతం తన పెట్టుబడిదారులకు బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ కంపెనీ సైతం తన ఇన్వెస్టర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై 5 ఉచిత బోనస్ షేర్లను అందిచాలని అక్టోబర్ 4న నిర్ణయించింది. అయితే ఇందుకు నవంబర్ 9ని రికార్డు తేదీగా కంపెనీ ప్రకటించింది. BSE సమాచారం ప్రకారం పునీత్ కమర్షియల్స్ షేర్లు నవంబర్ 9, 2022 నుంచి ఎక్స్-బోనస్ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాయి. నవంబర్ 7న మార్కెట్ ముగిసే సమయంలో కంపెనీ షేర్ విలువ రూ.51.25గా బీఎస్ఈలో నమోదైంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications