Nvidia: మొన్నటికి మొన్న ఆపిల్‌ను వెనక్కునెట్టి మార్కెట్ క్యాప్‌లో మైక్రోసాఫ్ట్ ముందుకు దూసుకుపోయింది. ఇప్పుడు మరో కంపెనీ దాని బాటలోనే నడుస్తోంది. ఇటీవల అమెజాన్ క్రాస్ చేసిన సంస్థ తాజాగా గూగుల్ కు షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయింది.
వాల్ స్ట్రీట్‌లో మూడవ అత్యంత విలువైన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రముఖ AI చిప్‌మేకర్ ఎన్‌విడియా(Nvidia) అధిగమించనున్నట్లు రాయిటర్స్ నివేదించింది. 2 దశాబ్దాల్లో మొదటిసారి అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించిన తర్వాత మరో మైలురాయిని టచ్ చేసేందుకు సిద్ధమైంది. ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులు మరియు సేవల్లో AIని చొప్పించడంతో టెక్ పరిశ్రమ నుంచి భారీగా ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తోంది.

Nvidia మార్కెట్ క్యాప్ 1.78 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అమెజాన్ విలువ 1.75 ట్రిలియన్ డాలర్లను అధిగమించింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ స్టాక్‌లో 1.62 శాతం క్షీణత నెలకొనడంతో దాని మార్కెట్ విలువ 1.81 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మెటా ప్లాట్‌ఫారమ్‌ల వంటి ప్రధాన సాంకేతిక సంస్థలు Nvidia గ్రాఫిక్స్ ప్రాసెసర్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో మార్కెట్ మరింత పెరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
AI సెక్టార్‌లో Nvidiaకు గణనీయమైన భవిష్యత్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాని త్రైమాసిక ఫలితాల కంటే ముందుగానే ఎన్‌విడియా స్టాక్ టార్గెట్ ను ప్రముఖ ఫైనాన్షియల్ గ్రూప్ మిజుహో పెంచింది. హై-ఎండ్ AI చిప్ మార్కెట్‌లో Nvidia ఆధిపత్యం, దానిలో 80 శాతాన్ని నియంత్రించడం స్టాక్‌ను కొత్త శిఖరాలకు నడిపించినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications