Mukesh Ambani: నక్కతోక తొక్కిన ముఖేష్ అంబానీ.. గుజరాతీ ఇంటెలిజెంట్ డీల్..
Reliance Nvidia: మరోసారి అంబానీ చతురత బయటపడింది. గుజరాతీ బిజినెస్ స్కిల్స్ చూసి ప్రస్తుతం ఇండియాతో పాటు ప్రపంచం కూడా షాక్ అవుతోంది. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ పొందటంలో అంబానీకి మించిన వారు మరొకరు ఉండబోరని నేడు జరిగిన డీల్ మరోసారి నిరూపించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికా దిగ్గజ చిప్ మేకర్ ఎన్వీడియాతో చేసుకున్న డీల్ గురించే. భారతదేశంలో డిజిటలీకరణ వేగంగా ముందుకు సాగుతున్న వేళ ఏఐ సాంకేతికత చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలయన్స్ ఎన్వీడియా కలిసి దేశంలో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించటానికి భాగస్వామ్యం కలిగి ఉన్నాయని ఎన్వీడియా సీఈవో జెన్సన్ హువాంగ్ ప్రకటించారు. ప్రస్తుతం ఏఐ అభివృద్ధిలో అతిపెద్ద చిప్ తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఎన్వీడియా కీలక ఆటగాడిగా మారిన సంగతి తెలిసిందే.

అత్యధిక జనాభా కలిగి, అధిక సంఖ్యలో కంప్యూటర్ ఇంజనీర్లను కలిగి ఉండటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా హువాంగ్ అంబానీతో అన్నారు. దీనికోసం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో భాగస్వామిగా మారడం తనకు గౌరవంగా, విశేషంగా అందని ఎన్వీడియా సీఈవో పేర్కొన్నారు. ముంబైలో జెన్సన్ హువాంగ్‌తో సంభాషణ సందర్భంగా ఈ విషయం బయటకు వెల్లడైంది. యూఎస్, చైనాతో పాటు, భారతదేశంలో ఉత్తమ డిజిటల్ కనెక్టివిటీ మౌలిక సదుపాయాలు ఉన్నాయని ముఖేష్ పేర్కొన్నారు. టెలికాం రంగంలో జియో సేవల మాదిరిగానే ఎన్వీడియాతో భాగస్వామ్యం ద్వారా క్వాలిటీతో కూడిన ఏఐ ఇన్ ఫ్రా అందుబాటులోకి తీసుకురాగలమని అంబానీ బలమైన నమ్మకాన్ని ప్రదర్శించారు.

దీనికి ముందు సెప్టెంబరు 2023లో రిలయన్స్-ఎన్వీడియా భారతదేశంలో AI సూపర్ కంప్యూటర్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించాయి. దాని భాషలపై శిక్షణ పొందిన పెద్ద భాషా నమూనాలను నిర్మిస్తామని చెప్పాయి. అయితే తర్వాతి కాలంలో టాటా గ్రూప్‌తో ఇదే విధమైన భాగస్వామ్యాన్ని చిప్ మేకర్ ఆవిష్కరించింది.
Nvidia AI Summit 2024: అయితే ఎన్వీడియా దేశీయంగా టెక్ మహీంద్రా వంటి ఇతర భారతీయ సంస్థలతో సైతం ఒప్పందాలను కుదుర్చుకుంది. ఈకామర్స్ దిగ్గజం ఫిప్ కార్ట్ తో కస్టమర్ సేవలను అందించేందుకు, ఆరోగ్య రంగంలో వైద్య, పేషెంట్ కేర్ సేవలను అందించానికి ఏఐని వినియోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీనికి ముందు కొన్ని నెలల కిందట రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ జియో బ్రెయిన్, ఏఐ టూల్స్ గురించి వార్షిక సర్వ సభ్య సమావేశంలో స్టేక్ హోల్డర్లకు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలతో రానున్న రోజుల్లో రిలయన్స్ స్టాక్ లాభపడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 1.50 గంటల సమయంలో స్టాక్ స్వల్ప నష్టంతో రూ.2668 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది.


Click it and Unblock the Notifications