IPO News: ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ స్టాక్ మార్కెట్, ఐపీఓ మరియు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీన్ని గమనించిన ఇండియన్ కార్పొరేట్లు కొత్తగా పలు సంస్థలను మార్కెట్లో లిస్ట్ చేశారు.
ప్రైమ్ డేటాబేస్ గణాంకాల ప్రకారం మొత్తం 57 భారతీయ కార్పొరేట్లు 2023లో IPOలను లాంచ్ చేశాయి. ప్రైమరీ మార్కెట్‌లో ఇలా లిస్ట్ చేయడం ద్వారా 49 వేల 434 కోట్లను సేకరించాయి.అయితే 2022లో కేవలం 40 IPOల ద్వారానే 59 వేల 302 కోట్లను సమీకరించడం గమనార్హం.

అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2023లో 17 శాతం తక్కువ విలువైన IPOలు అందుబాటులోకి వచ్చాయి. ఇక మెగా IPO LICని మినహాయించగా.. 2023తో పోలిస్తే 2022లో 28 శాతం ఎక్కువగా కార్పొరేట్లు నిధులను సమీకరించాయి. దీన్నిబట్టి చూస్తే IPOలకు ఇన్వెస్టర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు ప్రైమ్ డేటా పేర్కొంది.
గతేడాది రిలీజ్ అయిన 57 IPOలలో, 41 IPOలు 10 రెట్ల కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను పొందాయి. వీటిలో 16 IPOలు 50 రెట్ల కంటే ఎక్కువగా సబ్‌స్రైబ్ అయ్యాయి. 9 IPOలు 3 రెట్లు, మిగిలిన 7 ఒకటి నుంచి 3 సార్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ కాబడ్డాయి. 2022తో పోల్చితే గతేడాదిలో రిటైల్ ఇన్వెస్టర్ల స్పందన బాగా పెరిగింది.
2022లో 5.66 లక్షల మంది IPO అప్లై చేసేందుకు పోటీపడగా.. 2023లో రిటైల్ పెట్టుబడిదారుల నుంచి వచ్చిన దరఖాస్తుల సగటు సంఖ్య 13.21 లక్షలకు పెరిగింది. ఈ విభాగంలో అత్యధికంగా 52.11 లక్షల దరఖాస్తులు టాటా టెక్నాలజీస్ కు వచ్చాయి. DOMS ఇండస్ట్రీస్ 41.30 లక్షలు, INOX ఇండియా 37.34 లక్షలతో తదనంతర స్థానాల్లో కొనసాగుతున్నాయి.
రిటైల్ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకున్న షేర్ల విలువ మొత్తం లక్షా 49 వేల 988 కోట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం IPOల ద్వారా సమీకరించిన దానితో పోలిస్తే అప్లై చేసిన మొత్తం 203 శాతం ఎక్కువగా ఉంది. 2022లో మాత్రం ఇది 22 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. అయితే రిటైల్ విభాగం కేటాయింపులు 13 వేల 749 కోట్లు కాగా గతేడాది 29 శాతంతో పోలిస్తే కొద్దిగా తగ్గి 28 శాతం వద్ద సెటిల్ అయింది.


Click it and Unblock the Notifications