2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం కొత్త రూ.500, రూ.2000 నోట్లను తీసుకు వచ్చారు. అయితే క్రమంగా రూ.2000 నోట్లను కూడా చలామణి నుండి తగ్గిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆర్బీఐ రూ.2 వేల నోట్లను చలామణి నుండి వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.దీనిి తోడు ముద్రణ నిలిపివేసింది. ఈ రెండు మార్గాల ద్వారా చలామణిని తగ్గిస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2వేల నోట్ల సంఖ్య 214 కోట్లకు తగ్గింది. దేశంలో చలామణిలోని మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిణామం కేవలం 1.6 శాతం. ఈ మేరకు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో తెలిపింది.
2021 మార్చి చివరి నాటికి దేశంలో 245 కోట్ల రూ.2వేల నోట్లు చలామణిలో ఉండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి వీటి సంఖ్య 214 కోట్లకు తగ్గింది. 2021 మార్చిలో అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం 2 శాతం. 2022 మార్చి నాటికి ఇది 1.6 శాతం తగ్గింది. మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.2వేల నోట్ల వ్యాల్యూ 17.3 శాతం నుండి 13.8 శాతానికి తగ్గినట్లు తెలిపింది.

ఇక రూ.500 నోట్ల చలామణి పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. 2021 మార్చి నాటికి 3,867.90 కోట్ల రూ.500 నోట్లు చలామణిలో ఉండగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఆ సంఖ్య రూ.4554.68 కోట్లకు పెరిగింది. దేశంలో చలామణిలోని మొత్తం కరెన్సీ నోట్లలో వీటి పరిమాణం ఏకంగా 34.9 శాతం. ఆ తర్వాత 21.3 శాతంతో రూ.10 నోట్లు ఉన్నాయి. మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.500 నోట్ల విలువ 73.3 శాతం. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు కాగా, వాటి వ్యాల్యూ రూ.31.05 లక్షల కోట్లు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications