IPO News: ప్రభుత్వ కంపెనీ రూ.10,000 కోట్ల ఐపీవో.. డోన్ట్ మిస్ ఛాన్స్ ఇన్వెస్టర్స్..!!
NTPC Green Energy: దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఐపీవోలు వరద మాదిరిగా వస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపుగా 9 ఐపీవోలు లిస్టింగ్ కోసం రావటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్ల చూపు ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీపై పడింది. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో వస్తున్న ఐపీవోపై ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఎన్టీపీసీ లిమిటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ అనుబంధ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ గురించే. తాజాగా కంపెనీ తన రూ.10,000 కోట్ల ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(DRHP) దాఖలు చేసింది. ప్రస్తుతం 2024లో ఈ ఐపీవో అతిపెద్ద ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. పైగా ఇందులో ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ లేదు. ఐపీవో మాతృ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్ ప్రస్తుత వాటాదారుల కోసం కోటాను కలిగి ఉంటుంది. ఈ కేటగిరీ కింద ఇష్యూలో గరిష్టంగా 10 శాతం కేటాయించబడుతుంది.

జెఫరీస్ రెన్యూవబుల్ వ్యాపారంలో బలమైన వృద్ధిని ఊహిస్తూ.. NTPC షేర్లపై 'BUY' రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ క్రమంలో ఎన్టీపీసీ షేర్లకు టార్గెట్ ధరను రూ.485గా ఉంచింది. వాస్తవానికి జెఫరీ అందించిన టార్గెట్ ధరను చివరి ముంపు ధర రూ.413.8 కంటే 17 శాతం పెరుగుదలను చూచిస్తోంది. భారతదేశ భవిష్యత్తు వ్యూహాలకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీ వ్యాపారాన్ని ఫాస్ట్ ట్రాక్ వృద్ధితో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. 8-9 GW YoYతో పోలిస్తే.. FY24 37-39 GW సాక్ష్యాధారాలతో పునరుత్పాదక ఇంధన బిడ్‌లు గణనీయంగా పెరిగాయని బ్రోకరేజ్ తెలిపింది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో రాంప్-అప్, కంపెనీ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్‌లు NTPC స్టాక్‌ను రీ-రేటింగ్ చేయడానికి కీలకమైన డ్రైవర్లుగా ఉన్నాయని జెఫరీస్ చెప్పింది.
ఎన్టీటీవీ ప్రకారం గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.75,000 కోట్లుగా ఊహించబడింది. కంపెనీ డీఆర్‌హెచ్‌పీ ప్రకారం.. NTPC గ్రీన్ దేశంలో కంపెనీ రెండు డైరెక్ట్ లిస్టెడ్ పీర్లు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, యూఎస్ లిస్టెడ్ కంపెనీ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ఉన్నాయి. ఈ రెండు కంపెనీల 2024 ఆర్థిక సంవత్సరలో రూ. 8,100-9,200 కోట్ల మధ్య ఆదాయాలు కలిగి ఉన్నాయి. ఇదే క్రమంలో ఎన్టీపీసీ గ్రీన్ కంపెనీ ఆదాయాలు రూ.1,900 కోట్లకు పైగా ఉంది. భవిష్యత్తు ఇంధన అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ సంస్థ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారు. కంపెనీ ఐపీవోకు భారీ స్పందన లభించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications