GDP: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ, భౌగోళిక సమస్యల కారణంగా ప్రపంచ దేశాల వృద్ధిరేటు తీవ్రంగా మందగించింది. ఇదే విషయాన్ని ఇటీవల పలు సంస్థలు సైతం ధ్రువీకరించాయి. చైనా, భారత్ మినహా ఇతరుల ఆర్థిక పరిస్థితిలో వృద్ధిని ఆశించలేమని ఇప్పటికే నివేదించాయి. ఈ క్రమంలో తాజాగా 2022-23 Q3 ఫలితాలను కేంద్రం విడుదల చేసింది. మూడవ త్రైమాసికంలో భారత వృద్ధిరేటుఎలా ఉంది? అంచనాలను అందుకోవడంలో సఫలమైందో, విఫలమైందో పరిశీలిద్దాం.

గతేడాదితో పోలిస్తే..
అక్టోబరు-డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి గాను భారత స్థూల దేశీయోత్పత్తి(GDP) గణాంకాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. గతేడాదితో ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం వృద్ధిరేటు మందగించినట్లు వెల్లడించింది. 2021-22 Q3లో 6.3 శాతంగా నమోదైన GDP వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.4 శాతానికి కుచించుకుపోయినట్లు తెలిపింది. తద్వారా వరుసగా రెండో త్రైమాసికంలోనూ వృద్ధి క్షీణించనట్లు అయింది. దీనికి తోడు ద్రవ్యలోటు సైతం గణనీయంగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

వడ్డీరేట్ల పెంపే కారణమా..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వరుసగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల డిమాండ్ దెబ్బతిన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తయారీ రంగం బలహీన పడటంతో వృద్ధిరేటు బాగా మందగించినట్లు భావిస్తున్నారు. ఈ త్రైమాసికంలో మాన్యుఫ్యాక్చరింగ్ వృద్ధి 1.1 శాతం క్షీణించింది. అయితే ఇలా జరగడం కూడా ఇది వరుసగా రెండోసారి. దీన్ని బట్టి వినియోగదారుల నుంచి డిమాండ్ లో తగ్గుదలతో పాటు ఎగుమతులు బలహీనంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

ఈ ఏడాది వృద్ధి రేటు ఎంతంటే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 7.0 శాతం ఉంటుందని తన రెండవ ముందస్తు అంచనాల్లో భాగంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే అంతకు ముందు ఏడాదిలో ఇది 8.7 శాతం ఉన్నట్లు మొదట ప్రకటించగా, 9.1 శాతానికి సవరించినట్లు తాజాగా వెల్లడించింది. కొవిడ్ అనంతరం ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కాగా డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకోవడంతో.. అప్పుడు పెద్ద మొత్తంలో వృద్ధిరేటు నమోదు అయినట్లు తెలుస్తోంది.

RBI అంచనా ప్రకారమే వృద్ధి:
2022-23 Q3లో వాస్తవ GDP రూ.40.19 లక్షల కోట్లుగా ఉందని కేంద్ర గణాంకాల శాఖ అంచనా వేసింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.38.51 లక్షల కోట్లతో పోలిస్ తే4.4 శాతం వృద్ధి నమోదైనట్లు వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ నామమాత్రపు GDP 15.9 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నట్లు చెప్పింది. అయితే ఈ నెల ప్రారంభంలో.. ద్రవ్య విధాన సమీక్షలో భాగంగా దేశీయ వృద్ధి రేటును 7 నుంచి 6.8 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. Q3లో 4.4శాతం, Q4లో 4.2 శాతం పెరుగుదల ఉంటుందని ఇప్పటికే ప్రకటించగా.. ఇప్పడు అదే నిజమైంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications