Adani Enterprises అప్పులపై స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆరా.. ఆ కారణంగా నేడు పతనమైన అదానీ స్టాక్స్..
Adani News: అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రుణ చెల్లింపులకు సంబంధించిన వివరాలు అందించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కోరింది. ఇటీవల ప్రమోటర్లకు సంబంధించిన రుణాలన్నింటినీ అదానీ గ్రూప్ తిరిగి చెల్లించిందని.. స్టేక్ హోల్డర్లందరూ విశ్వసించాలని కోరుతూ ప్రచురితమైన వార్తకు సంబంధించి అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి తాజాగా ఎక్స్ఛేంజ్ వివరణ కోరింది.
దీనిపై కంపెనీ నుంచి ఎన్ఎస్ఈతో పాటు బీఎస్ఈ కూడా ప్రతిస్పదనను కోరింది. ఎనర్జీ నుంచి పోర్ట్స్ వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ వాస్తవానికి మొత్తం 2.15 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించిందా అనే ప్రశ్నలను 'ది కెన్' నివేదిక ప్రచురించిన తర్వాత అదానీ స్టాక్స్ ఈరోజు పతనమయ్యాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఏకంగా 7.09 శాతం మేర నష్టపోయి రూ.1,600.85 వద్ద నేడు ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ముగించింది.

ఈ నెల ప్రారంభంలో అహ్మదాబాద్‌కు చెందిన గ్రూప్ మార్చి 31 నాటి నిర్ణీత కాలక్రమం కంటే ముందుగా మార్జిన్-లింక్డ్ షేర్-బ్యాక్డ్ ఫైనాన్సింగ్ ముందస్తు చెల్లింపును పూర్తి చేసినట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్ ప్రీపేమెంట్ ప్రకటన తర్వాత బ్యాంకులు అదానీ పోర్ట్స్ తాకట్టు పెట్టిన షేర్లను మాత్రమే విడుదల చేశాయని కెన్ నివేదిక వెల్లడించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్‌ల తాకట్టు పెట్టిన షేర్లను రుణ చెల్లింపు ప్రకటన వెలువడి నెల గడిచినా బ్యాంకు విడుదల చేయలేదని కూడా సూచించింది.

ఇది కాకుండా సిమెంట్ సంస్థలైన ACC, అంబుజా సిమెంట్స్‌లను కొనుగోలు చేయడానికి గత సంవత్సరం తీసుకున్న 4 బిలియన్ డాలర్ల విలువైన రుణాల నిబంధనలను భారతీయ సమ్మేళనం మళ్లీ చర్చలు జరపాలని కోరుతున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ మూలాలను ఉటంకిస్తూ నివేదించింది. అదానీ గ్రూప్ 3 బిలియన్ డాలర్ల బ్రిడ్జ్ లోన్ పదవీకాలాన్ని ఐదేళ్ల కాలానికి లేదా ప్రస్తుతం ఉన్న 18 నెలల కాలానికి పొడిగించేందుకు రుణదాతలతో చర్చలు ప్రారంభించిందని నివేదిక పేర్కొంది. దీనికి తోడు 24 నెలల్లో మెచూరిటీ అయ్యే 1 బిలియన్ డాలర్ల లోన్ ను ఐదేళ్ల వరకు పొడిగించే రీపేమెంట్ షెడ్యూల్‌తో సీనియర్ సెక్యూర్డ్ డెట్‌గా మార్చాలని కూడా కోరుతోంది.


Click it and Unblock the Notifications