Gold: ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) గురించి తెలుసా? గోల్డ్ మార్కెట్ శాసించబోయే కొత్త ట్రెండ్ ఇదే!

భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక సెంటిమెంట్ , సురక్షితమైన పెట్టుబడి. అయితే ప్రతిసారీ షాపుకు వెళ్లి భౌతికంగా బంగారం కొనడం, దాన్ని దాచుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE) ఇప్పుడు బంగారం (Gold) ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది. అదే 'ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్' (EGR).

NSE Launches Electronic Gold Receipts A Revolutionary New Way To Buy And Trade Gold In India

ఏంటి ఈ NSE EGR?

సింపుల్ గా చెప్పాలంటే.. మీరు నగదు ఇచ్చి బంగారం కొనే బదులు, దానికి సమానమైన డిజిటల్ రిసీట్‌ను కొంటారు. మీ బంగారం సెబీ (SEBI) గుర్తింపు పొందిన ఒక సురక్షితమైన లాకర్‌లో (Vault) భద్రంగా ఉంటుంది. దానికి సాక్ష్యమే ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ (EGR). అంటే మీరు ఫిజికల్ గోల్డ్‌ను నేరుగా చేతిలోకి తీసుకోకుండా, దానికి సమానమైన డిజిటల్ రశీదును (Receipt) మీ డీమ్యాట్ ఖాతాలో ఉంచుకుంటారు. మీరు కొన్న బంగారం సురక్షితమైన వాల్ట్స్ (Vaults) లో భద్రంగా ఉంటుంది. ఇది కేవలం ఒక పేపర్ లాంటిది కాదు, సెబీ (SEBI) నిబంధనల ప్రకారం స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొన్నట్టే మీరు బంగారాన్ని కూడా ట్రేడింగ్ చేయవచ్చు. ఎలక్ట్రానిక్ రిసీట్స్ ద్వారా బంగారాన్ని కొనవచ్చు, అమ్మవచ్చు.

'వన్ నేషన్.. వన్ ప్రైస్'

EGR వల్ల వచ్చే అతిపెద్ద లాభం ఏంటంటే దేశమంతా ఒకే ధర ఉండటం. సాధారణంగా ఊరిని బట్టి, రాష్ట్రం బట్టి బంగారం ధరల్లో తేడాలు ఉంటాయి. కానీ NSE ద్వారా ఈ EGR కొంటే దేశం మొత్తం ఒకే పారదర్శకమైన ధర ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టర్లకు మోసపోయే ఛాన్స్ ఉండదు.

దొంగల భయం లేదు.. స్వచ్ఛత పక్కా!

బంగారం ఇంట్లో ఉంటే దొంగతనం జరుగుతుందేమో అన్న భయం ఉంటుంది. కానీ EGR డిజిటల్ రూపంలో ఉండటం వల్ల ఆ రిస్క్ అస్సలు లేదు. అంతేకాదు, మీరు కొనే ప్రతి గ్రాము పసిడి ప్రభుత్వ గుర్తింపు పొందిన వాల్ట్స్‌లో ఉంటుంది కాబట్టి, దాని క్వాలిటీ , స్వచ్ఛత (Purity) విషయంలో 100% గ్యారెంటీ ఉంటుంది.

ఇతర ఉపయోగాలు..

  • చిన్న మొత్తంలో పెట్టుబడి: మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న డినామినేషన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.
  • ఈజీగా అమ్మేయవచ్చు: మీకు డబ్బులు అత్యవసరమైనప్పుడు, షాపుకు వెళ్లి తక్కువ రేటుకు అమ్మేయాల్సిన పనిలేదు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ టైమ్ లో ఎప్పుడైనా మీ EGRలను అమ్మి నగదుగా మార్చుకోవచ్చు.
  • ఫిజికల్ గోల్డ్‌గా మార్చుకోవచ్చు: మీకు కావాలనుకుంటే, మీ దగ్గర ఉన్న EGRలను తిరిగి ఇచ్చేసి, దానికి సమానమైన భౌతిక బంగారాన్ని (Physical Gold) కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

మొత్తంగా చెప్పాలంటే NSE తీసుకొచ్చిన ఈ సరికొత్త EGR విధానం ఇన్వెస్టర్లకు ఒక వరం లాంటిది. భౌతిక బంగారంతో వచ్చే తరుగు, మజూరీ, భద్రత సమస్యలకు ఇది ఒక పక్కా డిజిటల్ పరిష్కారం. పాతకాలం నాటి బంగారం కొనుగోలు పద్ధతులకు ఈ EGR ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది. ఇన్వెస్టర్లకు ఇది నిజంగానే ఒక కొత్త దారి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+