For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

NSE కో-లొకేషన్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. ఆ దేశం కేంద్రంగానే హవాలా.. పరిశోధనలో..

|

NSE Co-Location Scam: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కో-లొకేషన్ స్కామ్‌పై వివిధ ఏజెన్సీలు జరిపిన పరిశోధనల్లో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇందులో హవాలా కార్యకలాపాలకు.. చైనా, యూఎస్, యూకే, పశ్చిమాసియాలోని ఇతర గ్లోబల్ ఎక్స్ఛేంజీలకు వ్యాపారం కోసం డబ్బును దుబాయ్‌ కేంద్రంగా మళ్లించినట్లు తేలింది. NSE, MCX, BSE, SHFE వంటి ఇతర గ్లోబల్ ఎక్స్ఛేంజీల మధ్య ట్రేడింగ్ లింక్‌లను ఏర్పాటు చేయడానికి బ్రోకర్లు చట్టవిరుద్ధమైన మార్గాలను మోహరించినట్లు వెలుగులోకి వచ్చింది. భారత్ లో పన్నులను తప్పించుకునేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో లేదా సంస్థాగత పెట్టుబడులుగా మభ్యపెడుతూ భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ చేసేందుకు రౌండ్-ట్రిప్డ్ డబ్బును వినియోగించటం మన దేశంలో చట్టవిరుద్ధం. అయినప్పటికీ థర్డ్-పార్టీ సర్వర్ల ద్వారా వీటిని నిర్వహిస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది.

మిల్లీసెకన్ల తేడాతో..
ఈ వ్యవహారంలో మారిషస్, యూఎస్ నుంచి అధిక-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్లతో పాటు, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ రిజిస్టర్ అయిన భారత బ్రోకర్లకు సైతం లింక్ ఉన్నట్లు తేలింది. దుబాయ్, ముంబై మధ్య దాదాపు 26 మిల్లీసెకన్ల వద్ద పాయింట్ టు పాయింట్ లేటెన్సీ (ట్రేడింగ్ స్పీడ్) అత్యల్పంగా ఉందని పరిశోధనలు కనుగొన్నాయి. ఇందుకోసం చాలా మంది వ్యాపారులు లక్షలు ఖర్చు చేసి వివిధ దేశాల మధ్య ట్రేడింగ్ స్పీడ్ మిల్లీసెకన్ల పాటు తేడా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నారు. చాలా మంది వ్యాపారులు తమ ఆఫ్‌షోర్ కంపెనీలను దుబాయ్‌లో నమోదు చేసుకున్నారు.

Dubai was a key conduit for routing money to other global exchanges in NSE co-location scam

దుబాయ్ ఎందుకు?
డబ్బును హవాలా మార్గంలో దుబాయ్‌కి పంపించి, అక్కడి నుంచి అన్ని ప్రాంతాలకు మళ్లించారు. కనెక్టివిటీ ఏర్పడిన తర్వాత వ్యాపారులు భారతదేశంలోని ఎవరికైనా సాధారణ లావాదేవీల ద్వారా కావలసిన గమ్యస్థానానికి మార్పిడి ప్లాట్‌ఫారమ్‌లో డబ్బును కూడా బదిలీ చేయవచ్చని వర్గాలు చెబుతున్నాయి. ఇలా కొన్ని ట్రేడ్స్ చేసి దాని ద్వారా డబ్బును నల్ల ధనం రూపంలో దేశంలోకి తీసుకు రావటం సులువు. నష్టాల్లో ఉన్న బ్రోకరేజ్ సంస్థల పుస్తకాల్లో వీటిని సర్థుబాటు చేసి తక్కువ టాక్స్ చెల్లిస్తారు. అక్రమంగా విదేశాలకు డబ్బును పంపేందుకు కూడా ఇదే మార్గాన్ని వినియోగించబడుతోంది. పైగా దుబాయ్ లో 20 ఫ్రీ జోన్స్ ఉన్నాయి. అక్కడ 100 శాతం గోప్యత ప్రయోజనం కూడా ఉంది. దీనిని అక్రమార్కులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఇలాంటి అనేక థర్డ్-పార్టీ డేటా సెంటర్‌లు ముంబై, ఢిల్లీ నుండి నడుస్తున్నాయి.

ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లు ఉన్నత స్థాయి NSE ఇన్‌సైడర్‌ల ద్వారా బ్రోకర్‌లకు విక్రయించబడ్డాయి. వివిధ ఎక్స్ఛేంజీల మధ్య కనెక్టివిటీకి సంబంధించిన వాస్తవాలు ఇద్దరు NSE ఉద్యోగుల ఈ-మెయిల్స్ లో కూడా చర్చించబడినట్లు దర్యాప్తు నివేదికలో ప్రస్థావించారు.

English summary

NSE కో-లొకేషన్ స్కామ్‌లో విస్తుపోయే వాస్తవాలు.. ఆ దేశం కేంద్రంగానే హవాలా.. పరిశోధనలో.. | NSE co-location scam highlights round-tripping of money as dubai central

Dubai was a key conduit for routing money to other global exchanges in NSE co-location scam
Story first published: Monday, June 27, 2022, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X