సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) ఆనంద్ సుబ్రమణియంను అరెస్ట్ చేసింది. 2018 నాటి మార్కెట్ మాణిప్యులేషన్ కేసులో గతరాత్రి చెన్నైలో అరెస్ట్ చేశారు. అతనిని అక్కడి నుండి ఢిల్లీకి తీసుకు వెళ్లారు. ఈ కేసు దర్యాఫ్తుకు ఆయన సహకరించడం లేదని తెలుస్తోంది. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కాం ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే తన మెయిల్ ఐడీ వివరాలు చెప్పమంటే మరిచిపోయానని ఆనంద్ సుబ్రమణియం సమాధానమిచ్చారని వార్తలు వస్తున్నాయి. 2013 ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆనంద్ సుబ్రమణియన్ చీఫ్ స్ట్రాటెజిక్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఆయనను గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చిత్రా రామకృష్ణ నియమించారు. ఆ తర్వాత ఎండీ సలహాదారుగా నియమించారు. ఇదంతా ఓ యోగి సూచన మేరకు చేసినట్లుగా సెబి దర్యాఫ్తులో వెల్లడైంది.

ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఎన్ఎస్ఈకి సంబంధించి ఆర్థిక, వ్యాపార ప్రణాళికలతో పాటు, డివిడెండ్, ఆర్థిక ఫలితాల వంటి అంతర్గత సమాచారాన్ని చిత్రా రామకృష్ణ సదరు యోగితో పంచుకున్నారని, ఆ అదృశ్య యోగి.. ఈ ఆనంద్ సుబ్రమణియం అనే వార్తలు కూడా వస్తున్నాయి. యోగి పేరుతో చిత్రకు ఈ మెయిల్స్ పంపించి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై దర్యాఫ్తు చేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications