NSE: గత కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరును మెరుగు పరిచేందుకు ఎన్ఎస్ఈ అనేక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఎస్జీఎక్స్ నిఫ్టీని.. గిఫ్ట్ నిఫ్టీగా పేరు మార్చటంతో పాటు ట్రేడింగ్ వేళల్లోనూ మార్పులు తీసుకొచ్చింది.
అయితే తాజాగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ విధానంలో కొత్త మార్పులను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 4, 2023 నుంచి బ్యాంక్ నిఫ్టీ వీక్లీ F&O కాంట్రాక్టులు గురువారం కాకుండా బుధవారాలతో ముగియనున్నాయి. దీనిలో భాగంగా మొదటి బుధవారం వీక్లీ ఎక్స్‌పైరీ సెప్టెంబర్ 6, 2023కి షెడ్యూల్ చేయబడింది. ఒకవేళ బుధవారం ఏదైనా కారణాల వల్ల సెలవు దినం అయితే ముందరి రోజు కాంట్రాక్టుల గడువు ముగుస్తుందని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది.

అయితే బ్యాంక్ నిఫ్టీ నెలవారీ, క్వార్టర్లీ కాంట్రాక్టుల గడువు ముగింపు రోజుల్లో ఎటువంటి మార్పు లేదని తన సర్క్యులర్‍లో ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఈ ఒప్పందాల గడువు మాత్రం ప్రతి నెల/త్రైమాసికంలో చివరి గురువారం ముగుస్తుంది. "ట్రేడింగ్ సైకిల్‌లో ఎటువంటి మార్పు లేదు అంటే నిఫ్టీ బ్యాంక్ 4 వీక్లీ ఎక్స్‌పైరీ కాంట్రాక్ట్‌లు (నెలవారీ కాంట్రాక్ట్‌లు మినహా), 3 నెలవారీ గడువు కాంట్రాక్టులు, 3 త్రైమాసిక గడువులు (మార్చి, జూన్, సెప్టెంబరు & డిసెంబర్ సైకిల్) కొనసాగుతుంది" అని NSE తెలిపింది.
ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ విషయానికి వస్తే.. వారాంతపు, నెలవారీ ఎక్స్‌పైరీ ఇకపై బుధవారానికి బదులుగా సోమవారానికి మార్చబడినట్లు ఎన్ఎస్ఈ తెలిపింది. మొదటి సోమవారం గడువు ఆగస్టు 21, 2023న ముగుస్తుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం.. సోమవారం - నిఫ్టీ మిడ్‌క్యాప్ ఆప్షన్స్; మంగళవారం - నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్; బుధవారం - బ్యాంక్ నిఫ్టీ, గురువారం - నిఫ్టీ 50 ఎక్స్‌పైరీ కానున్నాయి. అలాగే బీఎస్ఈ రీలాంచ్ చేసిన సెన్సెక్స్ బ్యాంకెక్స్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల గడువు శుక్రవారంతో ముగుస్తుంది.
దీనికి ముందు ఎన్ఎస్ఈ బ్యాంక్ నిఫ్టీ గడువును గురువారం నుంచి శుక్రవారానికి మార్పు చేయటం జరిగింది. అయితే దీనిని కొన్ని కారణాల వల్ల రద్దు చేయటం జరిగింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications