2024 Warning: కొత్త ఏడాదిలో ఇన్వెస్టర్లు 2 పనులు అస్సలు చేయెుద్దంటూ హెచ్చరిక..!
Trading Alert: దేశీయ స్టాక్ మార్కెట్లు 2023 చివర్లో భారీ ర్యాలీతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో సెన్సెక్స్, నిఫ్టీలు తమ జీవితకాల గరిష్ఠాలకు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే అనేక మంది ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉన్న పెట్టుబడులును కొనసాగించాలా లేక లాభాలు స్వీకరించాలా అనే డైలమాలో చాలా మంది ఉన్నారు. మరో పక్క ఇలాంటి పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయాలా వద్దా అనే సంకోచంలో మరికొందరు ఇన్వెస్టర్లు సతమతమౌతున్నారు.

కొత్త ఏడాదిని పుసర్కరించుకుని ఎన్ఎస్ఈ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆశిష్‌కుమార్ చౌహాన్ దేశీయ ఇన్వెస్టర్లకు కీలక సూచన చేశారు. స్టాక్ మార్కెట్ దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం ఉద్దేశించబడిందని గుర్తుచేశారు. ప్రమాదకరమైన ట్రేడ్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇందులో భాగంగా పెట్టుబడిదారులు ఓవర్ ట్రేడింగ్, డెరివేటివ్ ట్రేడింగ్ లకు దూరంగా ఉండాలని చౌహాన్ సూచించారు. నూతన ఏడాదిలో ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లను వివేకం, శ్రద్ధతో ఆర్థిక వృద్ధికి సంబంధించిన ప్రయాణాన్ని ప్రారంభించమని ప్రోత్సహిస్తుందన్నారు.
అధిక లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో గుర్తింపు లేని మధ్యవర్తుల మాయలో పడొద్దని ఆశిష్ హెచ్చరించారు. అలాగే క్రమబద్ధీకరించబడిన ఆర్థిక ఉత్పత్తుల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు. దీర్ఘకాలిక పెట్టుబడులు సాధారణంగా గత అనుభవాల ఆధారంగా మెరుగైన ఫలితాలను ఇస్తాయని, భారతదేశ వృద్ధి కథనంలో నిబద్ధతతో భాగస్వాములు కావడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తూ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తారని చౌహాన్ అన్నారు.


Click it and Unblock the Notifications