అల్టర్నేటివ్ వేదికగా ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ.. ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి..
మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) తాజాగా ప్రముఖ ఎక్స్ఛేంజీలు NSE అండ్ BSE అల్టార్నేటివ్ ట్రేడింగా వ్యవహరించాలని జారీ చేసిన సర్క్యులర్ ద్వారా ఆదేశించింది. ఈ ఆదేశాలు 1 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి రానున్నాయి.
"ఎక్స్ఛేంజిలతో చేర్చించిన తరువాత బిఎస్‌ఇకి ఎన్‌ఎస్‌ఇ అల్టార్నేటివ్ ట్రేడింగా ఉంటుంది, ఈ రెండు ఎక్స్ఛేంజీలు జాయింట్ SOPని రెడీ చేస్తాయి, అలాగే ఎక్స్ఛేంజ్ అండ్ అలెర్నేటివ్ ట్రేడింగ్ అవెన్యూ ఒకదానికి ఒకటి బాధ్యత వహిస్తాయి " అని సెబీ తెలిపింది .

SOP సర్క్యులర్ జారీ చేసిన తేదీ నుండి 60 రోజులలోపు SEBIకి అందించాలి అని SEBI తెలిపింది. క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్‌లు, కరెన్సీ డెరివేటివ్‌లు, ఇంట్రెస్ట్ రేటు డెరివేటివ్‌లు ఉన్న ఎక్స్ఛేంజీల ఇంటర్‌ఆపరబుల్ విభాగాలకు కూడా రెగ్యులేటర్ ఈ ఆదేశాలు జారీ చేసింది.
నోటిఫికేషన్ ప్రోటోకాల్ అంతరాయం ఏర్పడితే ఎక్స్ఛేంజ్ 75 నిమిషాలలోపు ఇతర ఎక్స్ఛేంజ్ అండ్ SEBIకి తెలియజేయల్సీ ఉంటుంది. ఇది మార్కెట్ స్థిరత్వాన్ని పెంపొందించడం ఇంకా అంతరాయాలను తగ్గించడంపై SEBI దృష్టిని నొక్కి చెబుతుంది,
నేడు స్టాక్ మార్కెట్
ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ ఈక్విటీలలో మిశ్రమ ధోరణి మధ్య అదానీ ఎనర్జీ సోల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఇంటెర్ప్రైజెస్, ఎన్టీపిసి గ్రీన్ ఎనర్జీ లాభాలతో కొనసాగుతుండగా వోడాఫోన్, జొమాటో షేర్లు రెడ్ మార్కులో ఉన్నాయి. బిఎస్‌ఇ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 740 పాయింట్ల ఎగిసి 79,043.74 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 160 పాయింట్లు లాభంతో 24,275 వద్ద కొనసాగుతుంది.


Click it and Unblock the Notifications